
కార్తీక్ సుబ్బరాజు తమిళ దర్శకుడే అయినా ఆయన తెలుగునాట కూడా బాగా పరిచయం. పిజ్జా, పేట వంటి సినిమాలు ఇక్కడ తెలుగులో బాగా ఆడాయి. ఆ మధ్య మెర్కూరి, ఇరైవి చిత్రాలు కాస్త తేడా కొట్టడంతో నిరాశ చెందిన ఈ యువ దర్శకుడు సూపర్ స్టార్ రజనీతో చేసాక క్రేజ్ రెట్టింపు అయ్యింది. పేట చిత్రం రజనీకాంత్‌ను ఖుషీ పరచడంతో పాటు ఆయన కెరీర్‌లో మరో సంచలన చిత్రంగా నమోదు అయ్యింది. దాంతో ఇప్పుడు ఆయన రామ్ చరణ్ చిత్రానికి పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే స్టోరీ డవలప్ చేయటంలో దర్శకుడు శంకర్ కు సాయపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పేట సినిమా చూసాక..రజనీకు ఇచ్చిన ఎలివేషన్స్ ,మాస్ పల్స్ పట్టుకుని రజనీని డీల్ చేసిన విధానం నచ్చి శంకర్ స్వయంగా పిలిచి కార్తీక్ సుబ్బరాజుని స్క్రిప్టులో కూర్చోబెట్టారట.
మెగా పవర్ స్టార్ చరణ్ - క్రియేటివ్ జీనియస్ శంకర్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియన్ సినిమా రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు - శిరీష్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి రానుంది.
'శంకర్ - చరణ్' చిత్రాన్ని సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. దీని కోసం ఇప్పటికే చెర్రీ కాల్షీట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలాఖరుకు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి.. చరణ్ సెప్టెంబర్ నెల నుంచి శంకర్ సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేశారు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ సినిమాలోని ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రంలోనే షూట్ చేయనున్నారట. ఒక సినిమా పూర్తి చేయడం కోసం ఎక్కువ సమయం తీసుకునే శంకర్.. రామ్ చరణ్ చిత్రాన్ని మాత్రం వీలైనంత తక్కువ టైం లో చేయడానికి ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. టైట్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి 2022 జూన్ నాటికి షూటింగ్ పూర్తి చేస్తానని నిర్మాతతో ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్.
ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందే సినిమా. రామ్ చరణ్ జోడీగా 'వినయ విధేయ రామా' బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ ను డైలాగ్ రైటర్ గా తీసుకున్నారు.