షూటింగ్ మొత్తం చీకట్లోనే.. కార్తీ ప్రయోగం!

By Prashanth MFirst Published May 20, 2019, 1:52 PM IST
Highlights

సాధారణంగా ఒక ప్లాప్ వస్తే ఏ హీరో అయినా సరే నెక్స్ట్ సినిమా కమర్షియల్ గా చేసేసి హిట్ కొట్టాలని అనుకుంటారు. సక్సెస్ రాకుంటే మళ్ళీ ప్రయోగం చేయడం పెద్ద రిస్క్ అని డిఫరెంట్ కథల జోలికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు. తమిళ హీరోల్లో ఈ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. 

అయితే యువ హీరో కార్తీ ఎన్ని ప్లాపులు ఎదురైనా ప్రయోగాలతోనే ముందుకు సాగుతానని అంటున్నాడు. దాదాపు తమిళ్ తెలుగులో ఒక రేంజ్ లో హిట్స్ అందుకునే కార్తీ ఇటీవల మాత్రం తెలుగులో దారుణంగా విఫలమవుతున్నాడు. ఖాకి సినిమాతో పర్వాలేదనిపించిన కార్తీ ఆ తరువాత చినబాబు - దేవ్ సినిమాతో నిరాశపరిచాడు. 

ఇక ఇప్పుడు ఖైదీ అనే మరొక డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ని పూర్తిగా రాత్రుల్లోనే చిత్రీకరించారట. 62 రోజుల పాటు నిర్విరామంగా రాత్రుళ్ళు షూటింగ్ జరిపిన ఏకైక చిత్రం ఇదే అయ్యి ఉంటుంది.  జైలు నుంచి తప్పించుకున్న ఒక ఖైదీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా అసలు పాయింట్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సమ్మర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

click me!