డబ్బులకు పడే రకాన్ని కాదు నేను.. ఛార్మి కామెంట్స్!

Published : May 20, 2019, 01:03 PM IST
డబ్బులకు పడే రకాన్ని కాదు నేను.. ఛార్మి కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి 'జ్యోతిలక్ష్మి' సినిమా తరువాత వెండితెరపై కనిపించలేదు. 

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఛార్మి 'జ్యోతిలక్ష్మి' సినిమా తరువాత వెండితెరపై కనిపించలేదు. నటించడం మానేసి దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలను నిర్మిస్తోంది.

ప్రస్తుతం పూరి నిర్మిస్తోన్న 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు ఛార్మి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక నటించరా..? అనే ప్రశ్నిస్తే ఛాన్స్ లేదని చెబుతోంది ఈ బ్యూటీ.  'జ్యోతి లక్ష్మి' సినిమా తరువాత నటనకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. పదిహేనేళ్లుగా నటిస్తూనే ఉన్నానని, నటనపై బోర్ కొట్టేసిందని చెప్పింది.

'జ్యోతి లక్ష్మి' సినిమా తరువాత చాలానే ఆఫర్లు వచ్చాయని, ఇప్పటికీ వస్తున్నట్లు చెప్పింది. ఐటెం సాంగ్స్ లో నటించమని చాలా మంది అడుగుతున్నారని.. భారీ మొత్తంలో పారితోషికం కూడా ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చింది.

అయితే తను డబ్బులకు పడిపోయే రకాన్ని కాదని, ఒకసారి వద్దనుకుంటే ఆ మాట మీదే ఉంటానని తెలిపింది. ప్రస్తుతం నిర్మాణ రంగంపై దృష్టి పెట్టినట్లు.. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తరువాత కూడా వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది.   

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా