ప్రభాస్‌కి మదర్‌ ఫిక్స్.. కౌసల్యగా హేమా మాలిని ?

By Aithagoni Raju  |  First Published Feb 1, 2021, 4:31 PM IST

తాజాగా `ఆదిపురుష్‌`కి సంబంధించి మరో క్రేజీ ఆప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్‌కి తల్లి ఫిక్స్ అయ్యింది. ప్రభాస్ కి తల్లి పాత్రలో నటించడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ `ఆదిపురుష్‌`లో ప్రభాస్‌కి తల్లిగా నటించడమంటే కచ్చితంగా అది చాలా ప్రత్యేకంగా, విశేషంగా ఉంటుంది. 


ప్రభాస్‌ సినిమాలో కాస్టింగ్‌, క్రూ భారీ స్థాయిలో యాడ్‌ అవుతూ అంచనాలను పెంచుతున్నాయి. `ఆదిపురుష్‌`, `సలార్‌`, నాగ్‌ అశ్విన్‌ ఇలా ప్రతి సినిమాలోనూ జాతీయ స్థాయి కాస్ట్ అండ్‌ క్రూ పనిచేస్తుంది. తాజాగా `ఆదిపురుష్‌`కి సంబంధించి మరో క్రేజీ ఆప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్‌కి తల్లి ఫిక్స్ అయ్యింది. ప్రభాస్ కి తల్లి పాత్రలో నటించడం పెద్ద విశేషం కాకపోవచ్చు. కానీ `ఆదిపురుష్‌`లో ప్రభాస్‌కి తల్లిగా నటించడమంటే కచ్చితంగా అది చాలా ప్రత్యేకంగా, విశేషంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రామాణయం ఆధారంగా రూపొందుతున్న సినిమా. 

ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్‌ నటిస్తున్నారు. రావణాసుడురు(లంకేష్‌)గా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు. సీతగా పలువురు కృతి సనన్‌ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రాముడి తల్లి కౌసల్య పాత్ర కోసం హేమామాలినిని సంప్రదించారట. ఆమె అందుకు గ్రీన్‌ సిగ్న్‌ ఇచ్చిందని సమాచారం. ఈ అప్‌డేట్‌ని త్వరలోనే చిత్ర బృందం ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. హేమా మాలిని ఇటీవల బాలకృష్ణ నటించిన `గౌతమిపుత్ర శాతకర్ణి`లో బాలయ్యకి తల్లిగా నటించిన విషయం తెలిసిందే. 

Latest Videos

రామాయణ పురాణగాథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా వర్క్ ని ప్రారంభించారు. వీఎఫ్‌ఎక్స్ కి ప్రయారిటీ ఉండటంతో ముందుగా గ్రాఫిక్స్ వర్క్ ని పూర్తి చేయబోతున్నారు. ఇవన్నీ పూర్తయ్యాక షూటింగ్‌ మొదలు పెడతారని, ఈ లోపు ప్రభాస్‌ `సలార్‌`లో మేజర్‌ పార్ట్ ని పూర్తి చేస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో భూషణ్‌ కుమార్, ఓం రౌత్, కిషన్‌ కుమార్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్‌ నిర్మిస్తున్నారు. దీన్ని 2022 ఆగస్ట్‌ 11న విడుదల చేయనున్నారు.
 

click me!