కార్తీ దేవ్ లుక్ తో అదరగొట్టేశాడే!

Published : Oct 25, 2018, 07:36 PM IST
కార్తీ దేవ్ లుక్ తో అదరగొట్టేశాడే!

సారాంశం

ఖాకి సినిమాతో మంచి విజయం అందుకొని చినబాబు సినిమాతో పరవాలేధనిపించిన కార్తీ నెక్స్ట్ మరో యాక్షన్ కథతో రాబోతున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా తెరక్కుతోన్న దేవ్ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఖాకి సినిమాతో మంచి విజయం అందుకొని చినబాబు సినిమాతో పరవాలేధనిపించిన కార్తీ నెక్స్ట్ మరో యాక్షన్ కథతో రాబోతున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా తెరక్కుతోన్న దేవ్ సినిమాకు రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు షూటింగ్ కూడా పూర్తికావోస్తోంది. 

ఇకపోతే దేవ్ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నేడు రిలీజ్ చేసింది. దేవ్ గా కార్తీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడని చెప్పవచ్చు. చేతిలో హెల్మెట్ తో ,వెనకాల రేసింగ్ బైక్ తో ఆకర్షిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు సినిమాలో మరో కథానాయికగా నిక్కీ గల్రాని నటిస్తోంది. ఖాకి చిత్రంతో బెస్ట్ జోడి అనిపించుకున్న రకుల్ - కార్తీ ఎస్ సినిమాలో కూడా ఆకట్టుకుంటారని చిత్ర యూనిట్ చెబుతోంది. 

ఇకపోతే ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ సినిమాను నిర్మిస్తుండగా తెలుగులో ఠాగూర్ మధు సినిమాను రిలీజ్ చేయనున్నారు. రమ్య కృష్ణ - ప్రకాష్ రాజ్ లు ప్రముఖ పాత్రల్లో కనిపిస్తుండగా హరీష్ జై రాజ్ సంగీతమందించనున్నారు. ఇక దేవ్ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Paradise 3 Days Collections: ప్యారడైజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు, వామ్మో ఈ రేంజ్‌లోనా.. నానిని ఆపడం కష్టమే
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?