అమర్ అక్బర్ అంథోని.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే!

Published : Oct 25, 2018, 06:50 PM ISTUpdated : Oct 25, 2018, 06:52 PM IST
అమర్ అక్బర్ అంథోని.. టీజర్ వచ్చేది ఎప్పుడంటే!

సారాంశం

గత ఏడాది రాజా ది గ్రేట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మాస్ మహారాజ రవితేజ ఆ తరువాత వరుసగా టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది రాజా ది గ్రేట్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మాస్ మహారాజ రవితేజ ఆ తరువాత వరుసగా టచ్ చేసి చూడు - నేల టిక్కెట్టు సినిమాలతో డిజాస్టర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా హిట్టుకొట్టాలనే రవితేజ కసి మీద ఉన్నాడు. 

తన కెరీర్ మొదట్లో మంచి బూస్ట్ ఇచ్చిన శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ అంథోని అనే డిఫరెంట్ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్స్ ఫస్ట్ లుక్ మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక సినిమా ప్రమోషన్స్ డోస్ పెంచడానికి చిత్ర యూనిట్ మరో ప్లాన్ వేసింది. 

ఈ నెల 29న సినిమా టీజర్ ను లాంచ్ చేయాలనీ డిసైడ్ అయ్యారు. సాయంత్రం నాలుగంటలకు సోషల్ మీడియా ద్వారా టీజర్ విడుదల కానుంది. రవితేజ ఈ సినిమాలో మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాను డిసెంబర్ 14న రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

BB జోడీ 2 కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
Sreeleela MBBS: డాక్టర్‌గా మారిన శ్రీలీల.. కానీ నెటిజన్లు ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసా?