నాటునాటు లేకపోతే అన్నం కూడా తినడంలేదు.. కరీనా కపూర్ కామెంట్స్ వైరల్

Published : Mar 19, 2023, 10:20 AM IST
నాటునాటు లేకపోతే అన్నం కూడా తినడంలేదు.. కరీనా కపూర్ కామెంట్స్ వైరల్

సారాంశం

ప్రతీ ఇండియన్ నరనరాల్లో నాటుకుపోయింది నాటు నాటు సాంగ్. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్దుల వరకూ ఈ పాటకు పూనకాలతో ఊగిపోతున్నారు. ఈక్రమంలో నాటు నాటు సాంగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్.   

ఏజ్ తో సంబంధం లేకుండా నాటు నాటు పాటకు అన్ని వయసుల వారు అభిమానులైపోతున్నారు. చిన్న పిల్లలకు చందమామా రావే అనిపాట పాడి అన్నం తినిపించినట్టు.. నాటు నాటు పాట పెట్టి అన్నం పెట్టాల్సినపరిస్థితివచ్చింది. అంతే కాదు నాటు నాటు పాట పెట్టకపోతే అన్నం తిననని పిల్లలు మారం చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఇదేదో ఓ సామాన్య కుటుంబంలో పరిస్థితి కాదు. ఓ సెలబ్రిటీ హీరోయిన్ కొడుకు అన్నం తినడానికి నాటు నాటు పాట పక్కాగా పెట్టాల్సిందేనట. 
 బాలీవుడ్ స్టార్  సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ రెండేళ్ల చిన్న కొడుకు జహంగీర్  నాటు నాటు పాటకుకర మస్త్  ఫ్యాన్ అయిపోయాడు.  రోజులో ఎన్ని సార్లు పాట పెట్టినా బోర్ అనుకోకుండా వినేస్తారట.. అంతే కాదు ఈ పాటు ఎంతలా నచ్చేసిందంటే..  ఆ పాట పెట్టకపోతే అన్నం మానేసేంతగా ప్రభావితం అయిపోయాడట. తన కొడుకు నాటు నాటు పాటకు డ్యాన్స్ వేయడాన్ని ఎంతో ఇష్టపడతాడని.. ఆ పాట ప్లే చేయకపోతే అన్నం కూడా తినడని కరీనా కపూర్  రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో వెల్లడించింది. 

అంతే కాదు ఇక్కడో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. కరీనా తనయుడు  నాటు నాటు పాట హిందీ వర్షన్ లో వినడట.. అచ్చ తెలుగు పాట అయితేనే ఆ కిక్ వస్తుందట.. అందుకే తెలుగుపాట పెడితేనే ఎంజాయ్ చేస్తాడట.. వేరే లాంగ్వేజ్ లో నాటు నాటు పెడితే.. వద్దని మారాం చేస్తాడట బుడ్డోడు. ఇక ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ డాన్స్ జూనియర్ సైఫ్ కు బాగా నచ్చేసినట్టుది.. వారి స్టెప్పులను తదేకంగా గమనిస్తాడంటోంది కరీనా కపూర్.  వీరిద్దరూ కలిసి వేసిన స్టెప్స్ ని ఎంతోమంది వేశారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. అంతే కాదు ప్రస్తుతం కరీనా కపూర్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. 

ఆర్ఆర్ఆర్ సినిమా.. ముఖ్యంగా నాటు నాటు పాట  ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.  తెలుగు పాట ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రియులను ఉర్రూతలూగించింది. ఇక నాటు నాటు పాట ప్రపంచ ప్రఖ్యాత వేదికపై..  గోల్డెన్ గ్లోబ్ తో పాటు  ఆస్కార్ అవార్డులు కూడా సాధించింది.  అంతర్జాతీయ వేదిక మీద తెలుగు పాట భారతీయ జెండా ఎగురవేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?