పడుకోవడానికి బాండ్ రాయమన్నాడు... కరాటే కల్యాణి కామెంట్స్!

Published : Mar 26, 2019, 11:07 AM IST
పడుకోవడానికి బాండ్ రాయమన్నాడు... కరాటే కల్యాణి కామెంట్స్!

సారాంశం

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది నటీమణులు మీడియా ముందు వెల్లడించారు. ఇప్పుడు నటి కరాటే కళ్యాణి కూడా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి  చెప్పుకొచ్చింది. 

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలా మంది నటీమణులు మీడియా ముందు వెల్లడించారు. ఇప్పుడు నటి కరాటే కళ్యాణి కూడా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

అయితే ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే కాస్టింగ్ కౌచ్ ఉందంటే ఒప్పుకోనని, ఆడవాళ్లు పనిచేసే ప్రతీ చోటా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని చెబుతోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా మంది తనను నైట్ ఫ్రీగా ఉంటావా..? బయటకి వెళ్దామా..? అని అడిగేవారని వాళ్లు అలా అడిగినప్పుడు సహకరిస్తే ఇంకొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటారని.. అలా అడిగినప్పుడు వెళ్లకుండా ఉంటే సరిపోతుందని చెప్పింది.

తాను టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీలో ఇంతకాలం ఉండగలిగానని తెలిపింది. కెరీర్ ఆరంభంలో ఓ వ్యక్తి.. నేను ఏది చెప్తే అది చేస్తే నెలకు యాభై వేలు జీతం ఇస్తానని, దానికి సంవత్సరం బాండ్ కూడా రాయమని అడిగినట్లు షాకింగ్ కామెంట్స్ చేసింది.

అలా చేయనని చెప్పినందుకు తన ఇంటి నుండి ఖాళీచేయమని చెప్పినట్లు.. వెంటనే అక్కడ నుండి వచ్చేసినట్లు తెలిపింది. ఇప్పటికీ ఆ వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్నాడు కానీ ఫేడ్ అవుట్  అయిపోయాడని వెల్లడించింది.   

PREV
click me!

Recommended Stories

చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?