బాహుబలితో కోట్లు సంపాదించుకొని తిరిగి నాకేమిచ్చారు... ఆర్ ఆర్ ఆర్ హక్కులు అడిగిన కరణ్ కి జక్కన్న ఎపిక్ సమాధానం

Published : Jan 18, 2023, 11:30 AM ISTUpdated : Jan 18, 2023, 12:07 PM IST
బాహుబలితో కోట్లు సంపాదించుకొని తిరిగి నాకేమిచ్చారు... ఆర్ ఆర్ ఆర్ హక్కులు అడిగిన కరణ్ కి జక్కన్న ఎపిక్ సమాధానం

సారాంశం

రాజమౌళి-కరణ్ జోహార్ కి సంబంధించిన ఓ ఫన్నీ త్రో బ్యాక్ వీడియో వైరల్ అవుతుంది. ఆర్ ఆర్ ఆర్ హిందీ రైట్స్ తనకు ఎందుకు ఇవ్వలేదని కరణ్ రాజమౌళిని అడిగారు.   

బాహుబలి(Bahubali) సిరీస్ హిందీలో భారీ సక్సెస్ అందుకుంది. వందల కోట్ల వసూళ్లు రాబట్టింది. బాహుబలి చిత్రాల నార్త్ సక్సెస్ వెనుక కరణ్ జోహార్ ఉన్నారు. ఏళ్లుగా పరిశ్రమలో పాతుకుపోయిన దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. హిందీ పరిశ్రమలో తెలుగు చిత్రాలకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగించి భారీ వసూళ్లు సాధ్యమయేలా చేశారు. బాలీవుడ్ పెద్దల సప్పోర్ట్ లేకపోతే తెలుగు సినిమాలను అక్కడ తొక్కిపడేస్తారు. కరణ్ జోహార్ బాహుబలి సిరీస్ ప్రెజెంటర్ గా ఉండి రాజమౌళి పని ఈజీ చేశారు. 

అదే సమయంలో పెద్ద మొత్తంలో సంపాదించుకున్నాడు. నిర్మాత శోభు యార్లగడ్డకు మించి కరణ్ జోహార్ లాభపడ్డారనేది టాక్. మరి రాజమౌళి చిత్రాలతో డబ్బులు రుచి మరిగిన కరణ్ జోహార్ ఎందుకు ఊరుకుంటారు. ఆర్ ఆర్ ఆర్ కూడా ఆయనే విడుదల చేయాలనుకున్నారు. కారణం ఏదైనా ఆర్ ఆర్ ఆర్ హిందీ హక్కులు పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడాకు దక్కాయి. 

కాగా ఆర్ ఆర్ ఆర్(RRR Movie) విడుదలకు ముందు ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో రాజమౌళితో కరణ్ జోహార్ ఈ విషయం చర్చకు తెచ్చారు. మీ బాహుబలి చిత్రాలను నేను హిందీలో విడుదల చేసి సక్సెస్ చేశాను. కానీ మీరు ఆర్ ఆర్ ఆర్ హక్కులు నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. ఆ మాటలకు రాజమౌళి ఎపిక్ రిప్లై ఇచ్చారు. బాహుబలి చిత్రాలతో వందల కోట్లు సంపాదించుకొని మీరు నాకు చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. మీ షోకి పిలిచి మైక్రోఫోన్ నా చెవిలో పెట్టారు. 

కానీ జయంతి లాల్ గడా నాకు ఆర్ ఆర్ ఆర్ హక్కులు ఇచ్చినందుకు బాంద్రాలో ఓ ఫ్లాట్ ఇస్తానని ప్రామిస్ చేశారు. అలాగే నిర్మాత డివివి దానయ్య జూబ్లీ హిల్స్ లో ఎకరం ఫ్లాట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కావాలంటే నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు రాజమౌళి. నేను మిమ్మల్ని ఇన్నేళ్ళుగా ప్రేమిస్తుంటే... మీరు కేవలం భౌతికమైన బహుమతులకు పడిపోయారా? అని కరణ్ జోహార్ వాపోయారు. 

ఇదంతా ఫన్ లో భాగంగా జరుగగా కరణ్- రాజమౌళి సంభాషణ ఆడియన్స్ కి మజా పంచింది.  ఆర్ ఆర్ ఆర్ విడుదలై భారీ విజయం సాధించింది. హిందీలో బాహుబలి 2 రేంజ్ వసూళ్లు సాధించకున్నా... రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్