కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర (Upendra) లేటెస్ట్ ఫిల్మ్ ‘కబ్జా’. ఇప్పటికే టీజర్ విడుదలై చిత్రంపై హైప్ క్రియేట్ చేసింది. సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటిస్తున్న తాజా పీరియడ్ యాక్షన్ ఫిల్మ్ ‘కబ్జా’ (Kabzaa). ఆర్. చంద్రు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఉపేంద్రతో పాటు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep), శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం భారతదేశ స్వాతంత్య్రానికి పూర్వం నుండి 1980ల వరకు ఓ గ్యాంగ్‌స్టర్ జీవితంలో జరిగిన ఘటనలపై తెరకెక్కిస్తున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్ తో అర్థం అవుతోంది. టీజర్ పవర్ ఫుల్ యాక్షన్ తో ఆకట్టుకుంది.
దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు తాజాగా గుడ్ న్యూస్ అందింది. చిత్రాన్ని మార్చి 17న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు అప్డేట్ అందింది. కన్నడ భాషలతో పాటు పాన్ ఇండియన్ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. కన్నడ పరిశ్రమ నుంచి మరో హిట్ సినిమా రాబోతుందంటూ ఫ్యాన్స్ ను అభిప్రాయపడుతున్నారు. చిత్రాన్ని మంత్రి ఎం.టి.బి. నాగరాజ్ ఆశీస్సులతో శ్రీ సిద్ధేశ్వర్ ఎంటర్‌ప్రైజెస్ నిర్మిస్తున్నారు. ఉపేంద్ర సరసన శ్రియా శరణ్ (Shriya Saran) హీరోయిన్ గా నటించింది. నవాబ్ షా, కబీర్ సింగ్ దుహన్, ప్రమోద్ శెట్టి, మురళీ శర్మ ఆయా పాత్రలను పోషిస్తున్నారు.
అయితే, ఈ చిత్రాన్ని కన్నడ పవర్ స్టార్, డాక్టర్ దివంగత పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) జయంతి రోజునే విడుదల చేయబోతుండటం విశేషం. దీంతో కన్నడ ప్రేక్షకులు మరింతగా ఖుషీ అవుతున్నారు. గతేడాది పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజున 'జేమ్స్' సినిమా విడుదలైంది. ఈ ఏడాది 'కబ్జా' ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. మరోవైపు ఉగాది పండుగ కానుకగానూ రాబోతోంది.
చిత్రానికి 'కేజీఎఫ్' ఫేమ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీగా, 'KGF' ఫేమ్ శివకుమార్ కళా దర్శకత్వం వహించారు. స్వాతంత్య్రానికి పూర్వం అండర్ వరల్డ్ కు సంబంధించిన కథే ఈ సినిమా. బెంగళూరు, మంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో భారీ సెట్లు ఏర్పాటు చేసి షూటింగ్ జరిపారు. తెలుగు, తమిళం, హిందీ సినిమాలకు చెందిన ప్రముఖ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించడంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు ఉన్నాయి.
Witness the rise of gangsters in India. Indian cinema's next big thing, hitting the silver screen on March 17th, 2023. pic.twitter.com/ogM9RZhWq9
— Anand Pandit Motion Pictures (@apmpictures)