ప్రముఖ సీరియల్ యాక్టర్ కన్నుమూత

prashanth musti   | Asianet News
Published : Jan 27, 2020, 08:14 AM IST
ప్రముఖ సీరియల్ యాక్టర్ కన్నుమూత

సారాంశం

నటుడిగా గత కొన్నేళ్లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ యాక్టర్ సంజీవ కులకర్ణి కన్నుమూశారు. బుల్లితెర నటుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా కూడా కులకర్ణి పలు షోల ద్వారా క్రేజ్ అందుకున్నారు.

సీరియల్స్ లో నటుడిగా గత కొన్నేళ్లుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ యాక్టర్ సంజీవ కులకర్ణి కన్నుమూశారు. బుల్లితెర నటుడిగానే కాకుండా వ్యాఖ్యాతగా కూడా కులకర్ణి పలు షోల ద్వారా క్రేజ్ అందుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ అందుకున్న కులకర్ణి రీసెంట్ గా అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

ఆయన గతకొంత కాలంగా కార్డియోమయోపతితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.  గతంలోనే ఆయన ఈ వ్యాధి భారిన పడి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అయినప్పటికీ మళ్ళీ పుంజుకొని నటుడిగా జీవితాన్ని సాఫీగా కొనసాగించారు. కార్డియోమయోపతితో కులకర్ణి 15ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు నారాయణ హృదయాలయలో జాయిన్ చేశారు.

కొన్ని రోజులుగా చిక్కిత్స అందుకుంటున్న ఆయన ఆదివారం కన్నుమూశారు.  సంభ్రమ-సౌరభ పేరిట ప్రతినెలా ప్రత్యేక ఈవెంట్స్ ని నిర్వహిస్తున్న కులకర్ణి కన్నడలో మంచి క్రేజ్ అందుకున్న సీరియల్స్ లో నటించారు. నాగిని, రాజారాణి, ఏటు-ఎదురీటు వంటి సీరియల్స్ తో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది. ఆయన మృతిపట్ల కన్నడ సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు నివాళులర్పించారు. సంజీవ కుమారుడు సౌరబ్ కులకర్ణి కూడా నటుడిగా కన్నడ పరిశ్రమలో కొనసాగుతున్నారు.

PREV
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌