ఇల్లీగల్ వెపన్ కేసు.. కన్నడ హీరో అరెస్ట్!

Published : Nov 05, 2018, 12:10 PM IST
ఇల్లీగల్ వెపన్ కేసు.. కన్నడ హీరో అరెస్ట్!

సారాంశం

కన్నడ సినిమాలలో హీరోగా నటిస్తోన్న జగదీశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్ గా అతడు తుపాకీని కొనుగోలు చేయడమే అరెస్ట్ కి కారణమని తెలుస్తోంది.

కన్నడ సినిమాలలో హీరోగా నటిస్తోన్న జగదీశ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్ గా అతడు తుపాకీని కొనుగోలు చేయడమే అరెస్ట్ కి కారణమని తెలుస్తోంది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మొహమ్మద్ నైజాం(25) అనే వ్యక్తిని ఇల్లీగల్ పనులు చేస్తోన్న కారణంగా అదుపులోకి తీసుకున్నారు.

అతడు ఇచ్చిన సమాచారాన్ని బట్టి జగదీశ్, సతీష్ కుమార్, సయ్యద్ సమీర్ అహ్మద్ లను అరెస్ట్ చేశారు. మొహమ్మద్ నైజాం దగ్గర హీరో జగదీశ్ నాటు తుపాకీని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన వారి దగ్గర నుండి పోలీసులు 2 తుపాకీలను, బులెట్ లను స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్ కన్నడ సినిమా 'సర్కార్' లో లీడ్ రోల్ పోషించాడు. 

పోలీసులు అరెస్ట్ చేయడంతో జగదీష్ తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదని.. తాను అమాయకుడినని అంటున్నాడు. ఒక స్నేహితుడికి ప్యాకట్ ని డెలివెరీ చేయాల్సి ఉండడంతో తనవద్దకు తుపాకీ వచ్చిందని ఆ ప్యాకెట్ లో ఏముందో తాను ఓపెన్ చేసి చూడలేదని అంటున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు