సీనియర్ నటుడి కారు యాక్సిడెంట్!

Published : Sep 24, 2018, 06:21 PM IST
సీనియర్ నటుడి కారు యాక్సిడెంట్!

సారాంశం

తెలుగులో ఒకప్పుడు విలన్ పాత్రలు పోషించిన కన్నడ నటుడు దేవరాజ్ ఇటీవల మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాలో కూడా ఓ పాత్ర పోషించారు. 

తెలుగులో ఒకప్పుడు విలన్ పాత్రలు పోషించిన కన్నడ నటుడు దేవరాజ్ ఇటీవల మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమాలో కూడా ఓ పాత్ర పోషించారు. ఈరోజు షూటింగ్ నుండి తిరిగి వెళ్తోన్న అతడి కారు యాక్సిడెంట్ కి గురైంది.

ఈ కారులో దేవరాజ్ తో పాటు నటుడు దర్శన్, దేవరాజ్ తనయుడు దర్శన్ కూడా ఉన్నారు. యాక్సిడెంట్ లో దేవరాజ్, ప్రజ్వల స్వల్ప గాయాలతో బయటపడగా.. నటుడు దర్శన్ చేయి విరిగినట్లు తెలుస్తోంది.

మైసూరులో ఓ ఆసుపత్రిలో వీరిని చేర్పించగా.. దర్శన్ కి సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు ఎవరు డ్రైవ్ చేశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. 
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు