హిందీ కాదు.. తెలుగు పరిశ్రమే టాప్‌.. టాలీవుడ్‌పై కంగనా ప్రశంసలు

By Aithagoni RajuFirst Published Sep 19, 2020, 8:37 PM IST
Highlights

కంగనా రనౌత్‌ తెలుగు చిత్రపరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌ కంటే టాలీవుడ్‌ ఉత్తమంగా ఉందన్నారు. 

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ తెలుగు చిత్రపరిశ్రమపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌ కంటే టాలీవుడ్‌ ఉత్తమంగా ఉందన్నారు. అంతేకాదు భారత్‌లోనే అగ్రస్థానంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఉందన్నారు. మరి ఉన్నట్టుండి కంగనా టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించడానికి కారణమేంటి? అనేది చూస్తే. 

ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తమ రాష్ట్రంలో ఫిల్మ్ సిటీని నిర్మాణం చేయబోతున్నట్టు తెలిపారు. దేశంలోనే అందమైన ఫిల్మ్ సిటీని త్వరలో ఉత్తర ప్రదేశ్‌లో నిర్మిస్తామని తెలిపారు. దీంతో ఆయనకు కౌంటర్‌గా కంగనా స్పందించింది. తనదైన స్టయిల్‌లో రియాక్ట్ అయ్యింది. 

`యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నా. చిత్రపరిశ్రమలో ఇలాంటి మార్పులు ఇంకా చాలా రావాలి. భారతదేశ సినీ ఇండస్ట్రీ అనే ఓ పెద్ద పరిశ్రమ మనకు కావాలి. మనం ఒక్కటిగా లేకపోవడం వల్ల దాన్ని హాలీవుడ్‌ చిత్రాలు అవకాశంగా మార్చుకుంటున్నాయి. ఒక్క చిత్ర పరిశ్రమ అనేక ఫిల్మ్ సిటీలు కావాలి` అని తెలిపింది. 

ఇంకా చెబుతూ, దేశంలో అగ్ర శ్రేణిలో హిందీ చిత్ర పరిశ్రమ ఉందని ప్రజలు అనుకుంటుంటారు. కానీ అది తప్పు. తెలుగు చిత్ర పరిశ్రమ టాప్‌ పొజీషియన్‌కి చేరింది. ఇప్పుడు వివిధ భాషల్లో పాన్‌ ఇండియా సినిమాలను ఆడియెన్స్ కి అందిస్తోంది. అనేక హిందీ సినిమాలను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్‌ జరిపార`ని చెప్పింది. 

`దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సామర్థ్యం సినిమాలకుంది. వ్యక్తిగత గుర్తింపు ఉంది. సామూహిక గుర్తింపు లేని అనేక చిత్ర పరిశ్రమలకు అఖండ భారతదేశంలా ఒక్కటి చేద్దాం. భిన్న భాషల్లో ఉన్న చిత్ర పరిశ్రమల్ని కలపండి, అప్పుడు మనం ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరతాం` అని ప్రధాని మోడీకి ట్యాగ్‌ చేశారు. 

ఇదిలా ఉంటే ఇటీవల ముంబయిలో కంగనాకి, మహారాష్ట్ర ప్రభుత్వానికి పెద్దయుద్దమే జరిగిన విషయం తెలిసిందే. కంగనా ఆఫీస్‌ని కూడా కూల్చేశారు. ఇది పెద్ద వివాదంగా మారింది. దీనిపై ఆమె నష్టపరిహారం చెల్లించాలని కోర్ట్ కి వెళ్ళారు.

click me!