నాతో కలిసి పని చేయడం ఆయనకిష్టం లేదు.. కంగనా షాకింగ్ కామెంట్స్!

Published : Aug 31, 2018, 06:59 PM ISTUpdated : Sep 09, 2018, 11:23 AM IST
నాతో కలిసి పని చేయడం ఆయనకిష్టం లేదు.. కంగనా షాకింగ్ కామెంట్స్!

సారాంశం

దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం 'మణికర్ణిక'. కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోంది. క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉండడంతో 'మణికర్ణిక' సినిమా పూర్తి చేసే బాధ్యతలు కంగనా చేపట్టింది.

దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన చిత్రం 'మణికర్ణిక'. కంగనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ప్యాచ్ వర్క్ జరుగుతోంది. క్రిష్ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ తో బిజీగా ఉండడంతో 'మణికర్ణిక' సినిమా పూర్తి చేసే బాధ్యతలు కంగనా చేపట్టింది. దర్శకురాలిగా మారి కొన్ని సీన్స్ పై వర్క్ చేస్తోంది. అయితే ఆమె డైరెక్ట్ చేస్తోందన్న కారణంతోనే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర పోషిస్తోన్న సోనూసూద్ తప్పుకున్నాడనే వార్తలు వెలువడ్డాయి.

ఈ విషయంపై స్పందించిన కంగనా.. ''నాలాంటి మహిళా దర్శకురాలితో కలిసి పనిచేయడం సోనుకి ఇష్టం లేదు. అందుకే ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. నేను సోనుని తక్కువ చేసి చూశాననే వార్తల్లో నిజం లేదు. నేను ఇప్పటివరకు ఆయన్ను కలిసిందే లేదు. అలాంటప్పుడు ఆయన్ను తక్కువగా ఎలా చూస్తాను. అసలు విషయమేమిటంటే.. సినిమాలో ఆయన సీన్స్ ని ఆయనే రాసుకున్నారు. స్క్రిప్ట్ లో అయన రాసుకున్న సీన్స్ లేవు.

క్రిష్ తో కలిసి స్క్రిప్ట్ లో లేని సీన్స్ చాలానే తెరకెక్కించారు. అది రచయితలకు నచ్చలేదు. అందులో నా తప్పేముంది. సినిమా కథ నేను రాశానా..?. సోను తెరకెక్కించిన సీన్స్ రచయితలకు నచ్చలేదు.. కానీ వాటిని ఆయన తొలగించకండని కోరారు. నా వెనుక ఇంత జరుగుతుందని నాకేం తెలుసు. నేను మణికర్ణిక సినిమాకు కేవలం బానిసను మాత్రమే. పాత్ర కోసం కష్టపడుతున్నాను'' అంటూ చెప్పుకొచ్చింది.  
 

PREV
click me!

Recommended Stories

Paradise 3 Days Collections: ప్యారడైజ్‌ మూవీ 3 రోజుల వసూళ్లు, వామ్మో ఈ రేంజ్‌లోనా.. నానిని ఆపడం కష్టమే
Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?