ప్రియుడిని పెళ్లాడేసిన హీరోయిన్!

Published : Aug 31, 2018, 06:19 PM ISTUpdated : Sep 09, 2018, 01:48 PM IST
ప్రియుడిని పెళ్లాడేసిన హీరోయిన్!

సారాంశం

కలర్స్ స్వాతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెళ్లి వేడుక చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. తను ప్రేమించిన వికాస్ ను పెళ్లి చేసేసుకుంది ఈ బ్యూటీ

కలర్స్ స్వాతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెళ్లి వేడుక చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. తను ప్రేమించిన వికాస్ ను పెళ్లి చేసేసుకుంది ఈ బ్యూటీ. మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పని చేస్తోన్న వికాస్, స్వాతి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.

అయితే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా ఈ పెళ్లి వేడుకను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుండి కానీ కోలీవుడ్ నుండి కానీ సెలబ్రిటీలను ఈ పెళ్లికి ఆహ్వానించలేదు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. రిసెప్షన్ ని మాత్రం గ్రాండ్ గా చేయాలని నిర్ణయించుకున్నారట. హైదరాబాద్, కొచ్చి రెండు ప్రాంతాల్లో రిసెప్షన్ ఇవ్వనున్నారని సమాచారం.

వివాహం జరిగిన తరువాత స్వాతి మలేషియాలో సెటిల్ అవుతుందనే వార్తలు వినిపించాయి. మరి ఈ విషయంపై ఈ బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి!

PREV
click me!

Recommended Stories

RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన- పగలబడి నవ్విన పారు-కార్తీక్ ప్రశ్న