అలియా చెత్త పాత్ర ఒప్పుకుంది.. దాంతో నాకు పోటీ ఏంటి..? కంగనా ఫైర్!

Published : Apr 11, 2019, 03:39 PM IST
అలియా చెత్త పాత్ర ఒప్పుకుంది.. దాంతో నాకు పోటీ ఏంటి..? కంగనా  ఫైర్!

సారాంశం

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. స్టార్ హీరోయిన్ అలియా భట్ పై మండిపడుతోంది.

గత కొద్దిరోజులుగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్.. స్టార్ హీరోయిన్ అలియా భట్ పై మండిపడుతోంది. తాజాగా మరోసారి ఆమెను టార్గెట్ చేస్తూ కంగనా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ లో అవార్డుల కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో అలియా భట్ నటించిన 'గల్లీభాయ్', కంగనా నటించిన 'మణికర్ణిక' చిత్రాలు పోటీపడ్డాయి. కొన్ని కేటగిరీల్లో ఈ రెండు చిత్రాలు అవార్డులు అందుకున్నాయి. ఉత్తమ నటిగా కంగనా అవార్డు అందుకుంది. 

ఈ క్రమంలో ఆమెని అలియా భట్ నుండి గట్టిపోటీ ఎదురైందా..? అని ప్రశ్నించగా.. దానికి ఆమె ''గల్లీభాయ్ లో అలియా పాత్ర అంత గొప్పదా..? నాకైతే పోటీ పడడం ఇబ్బందిగా అనిపించింది. ఆ సినిమాలో అలియా భట్ ది చాలా రొటీన్ క్యారెక్టర్. నాకు పెద్దగా నచ్చలేదు'' అంటూ చెప్పుకొచ్చింది.

అంతేకాదు.. అలాంటి పాత్ర నుండి తనకు పోటీ ఎదురవుతుందని ఎప్పుడూ అనుకోలేదని.. అలాంటి చెత్త పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆపేయాలని ఆమె అన్నారు. ప్రస్తుతం కంగనా.. 'మెంటల్ హై క్యా' అనే సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక అలియా విషయానికొస్తే.. బాలీవుడ్ లో పలుచిత్రాలతో బిజీగా ఉన్న ఆమె 'RRR'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.  

PREV
click me!

Recommended Stories

Kamal Haasan: 40 ఏళ్లుగా స్నేహం, కానీ మెగాస్టార్ విషయంలో కమల్ హాసన్ బాధ ఇదొక్కటే
Gunasekhar: ప్లాప్ ఇస్తే ఫోన్ కూడా ఎత్తరు.. వరుడు తర్వాత బన్నీ.. గుణశేఖర్ ఓపెన్ కామెంట్స్