తలైవి ట్రైలర్: జనం కోసం 'జయ' పోరాటం

By team teluguFirst Published Mar 23, 2021, 12:36 PM IST
Highlights

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు విడుదలైన తలైవి ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. జయలలితో ఎంజీఆర్ అనుబంధం ఎలా మొదలైంది, ఆమె రాజకీయాలలోకి రావడానికి ఎదురైనా పరిస్థితులు, అవమానాలతో పాటు, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగిన తీరు వంటి కీలక విషయాలు తలైవిలో చిత్రంలో చర్చించారు.

హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు కానుకగా నేడు తలైవి ట్రైలర్ విడుదల చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి చిత్రాన్ని తెరకెక్కించారు. నేడు విడుదలైన తలైవి ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. జయలలితో ఎంజీఆర్ అనుబంధం ఎలా మొదలైంది, ఆమె రాజకీయాలలోకి రావడానికి ఎదురైనా పరిస్థితులు, అవమానాలతో పాటు, అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఎదిగిన తీరు వంటి కీలక విషయాలు తలైవిలో చిత్రంలో చర్చించారు.

 
జయలలితగా కంగనా లుక్ మాత్రం పర్వాలేదు అన్నట్లుగా ఉంది. చాలా వరకు మేకప్, కెమెరా ట్రిక్స్ తో జయలలితకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేశారు. నటనపరంగా కంగనా ఆకట్టుకున్నారు. జయలలిత జీవితంలో కీలకమైన ఎంజీఆర్ రోల్ ని అరవింద స్వామి చేశారు. ఈ వర్సిటైల్ యాక్టర్ ఎంజీఆర్ రోల్ కి చక్కగా సరిపోయారు. 


ఎంజీఆర్ భార్య పాత్ర మధుబాల చేయగా, మరో కీలకమైన రోల్ సముద్ర ఖని చేసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ లో డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలను ప్రేమించు, నిన్ను ప్రజలు తిరిగి ప్రేమిస్తారు.. అదే రాజకీయం అని అరవింద స్వామి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. దర్శకుడు ఏ ఎల్ విజయ్ తలైవి కథను గొప్పగా తెరకెక్కించారని అర్థం అవుతుంది. 

మొత్తంగా కంగనా పుట్టినరోజు విడుదలైన తలైవి ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ బాషలలో తలైవి ఏప్రిల్ 23న విడుదల కానుంది. జీవి ప్రకాష్ తలైవి చిత్రానికి సంగీతం అందించారు.

click me!