కాంచన 3 ట్విట్టర్ రివ్యూ

Published : Apr 19, 2019, 10:26 AM ISTUpdated : Apr 19, 2019, 10:32 AM IST
కాంచన 3 ట్విట్టర్ రివ్యూ

సారాంశం

కోలీవుడ్ లో మొదటిరోజు భారీగా రిలీజయిన కాంచన 3 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ సృష్టించింది. సినిమా ప్రీమియర్స్ ను ఎగబడి చూసిన అభిమానులు రాఘవ లారెన్స్ టాలెంట్ కి మరోసారి ఫిదా అయ్యారు. 

మనిషిలో టాలెంట్ ఏంటో సమయాన్ని బట్టి పూర్తిగా అర్ధమవుతుంది అనే విషయాన్నీ లారెన్స్ విజువల్ గా ప్రజెంట్ చేస్తున్నాడు. డ్యాన్స్ మాస్టర్ గా క్లిక్కయిన మనోడు ఇప్పుడు దర్శకుడిగా బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్నాడు. కోలీవుడ్ లో మొదటిరోజు భారీగా రిలీజయిన కాంచన 3 అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్ సృష్టించింది. 

సినిమా ప్రీమియర్స్ ను ఎగబడి చూసిన అభిమానులు రాఘవ లారెన్స్ టాలెంట్ కి మరోసారి ఫిదా అయ్యారు. ట్విట్టర్ లో అయితే లారెన్స్ కాంచన 3కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. సినిమా డబుల్ మాస్ అని అంటున్నారు. కామెడీ తో పాటు మంచి హారర్ థ్రిల్ గా ఉందట. 

గత ముని సీక్వెల్స్ కంటే ఇప్పుడు మాస్ యాక్షన్ సీన్ లో హై రేంజ్ లో ఉన్నాయని టాక్ వస్తోంది. ఇక సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉందని చెబుతున్నారు. లారెన్స్ మరోసారి అద్భుతంగా కష్టపడ్డారని సినిమాటోగ్రఫీ కూడా మంచి కిక్ ఇస్తుందని అంటున్నారు. 

ఇక కామెడీ అందిస్తూనే హారర్ సీన్స్.. ఎమోషన్ సీన్స్ ని లారెన్స్ సమపాళ్లలో అందించాడని చెబుతున్నారు. మొత్తంగా లారెన్స్ మరోసారి త నట విశ్వరూపాన్ని చూపించి ముని 5 పోస్టర్ ని కూడా వదలడంతో ఈ సీక్వెల్స్ కి ఎదురులేదని ఆడియెన్స్ వారి అభిప్రాయాన్ని చెబుతున్నారు. 


 

 

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ
నన్ను చూసి ఉలిక్కిపడి చస్తుంటారు, అఖండ 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ ఆవేశం..6వ హిట్ రాబోతోంది