గుండెపోటుతో 'కామసూత్ర 3డి' నటి మృతి!

Published : Apr 21, 2019, 05:03 PM IST
గుండెపోటుతో 'కామసూత్ర 3డి' నటి మృతి!

సారాంశం

2013 లో వచ్చిన 'కామసూత్ర 3డి' చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన నటి సైరా ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. 

2013 లో వచ్చిన 'కామసూత్ర 3డి' చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైన నటి సైరా ఖాన్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయంపై కామసూత్ర దర్శకుడు రూపేష్ పాల్ విచారం వ్యక్తం చేశారు.

సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల సైరా ఖాన్ కి 'కామసూత్ర 3డి' చిత్రం సైన్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు.  అలాంటి బోల్డ్ ఫిలిం తో బాలీవుడ్ లో అడుగుపెట్టడం ఆమెకి సవాల్ గా మారిందని, కొన్ని నెలల తరువాత ఆమె ప్రయత్నం ఫలించిందని అన్నారు.

ఆమెలా ఎవరూ నటించి ఉండేవారు కాదని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఆమె మరణ వార్త గురించి మీడియాలో ఎలాంటి వార్తలు రాకపోవడంపై రూపేష్ పాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధ్బుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఆమెని ఎవరూ గుర్తించకపోవడం బాధాకరమని ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్నారు.  

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?