Vikram OTT Release Date: ఇండస్ట్రీ హిట్ విక్రమ్ ఓటీటీ డేట్ ఫిక్స్డ్ ... కమల్ ఫ్యాన్స్ కి పండగే!

Published : Jun 29, 2022, 12:36 PM IST
Vikram OTT Release Date: ఇండస్ట్రీ హిట్ విక్రమ్ ఓటీటీ డేట్ ఫిక్స్డ్ ... కమల్ ఫ్యాన్స్ కి పండగే!

సారాంశం

లేటెస్ట్ సెన్సేషన్ విక్రమ్ ఓటీటీ డేట్ వచ్చేసింది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ దక్కించుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అధికారికంగా డేట్ ప్రకటించింది. దీంతో కమల్ ఫ్యాన్స్ మూవీ లవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


2022 సౌత్ ఇండియా నుండి అద్భుతమైన చిత్రాలు విడుదలయ్యాయి. మార్చిలో విడుదలైన ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మల్టీస్టారర్ రూ. 1100 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఇక ఏప్రిల్ లో విడుదలైన కెజిఎఫ్ 2 (KGF 2) మరొక బాక్సాఫీస్ బొనాంజాగా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ కి మించిన అతిపెద్ద విజయం కెజిఎఫ్ 2 నమోదు చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్-యష్ కాంబినేషన్ లో వచ్చిన కెజిఎఫ్ 2 రూ. 1200 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. 

ఆర్ ఆర్ ఆర్, కెజిఎఫ్2 తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటింది విక్రమ్ మూవీ. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన విక్రమ్ సంచలన విజయం నమోదు చేసింది. విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ రికార్డు వసూళ్లు రాబట్టింది. బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ రీత్యా ఆర్ ఆర్ ఆర్ కంటే విక్రమ్ భారీ లాభాలు అందించింది. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

దర్శకుడు లోకేష్ కనకరాజ్ స్క్రీన్ ప్లే, యాక్షన్ సన్నివేశాలు మ్యాజిక్ చేశాయి. దశాబ్దాల తర్వాత కమల్ (Kamal Haasan)సిల్వర్ స్క్రీన్ పై విశ్వరూపం చూపించారు. ఫహద్ నటన, విజయ్ సేతుపతి విలనిజం సినిమాను మరో స్థాయికి చేర్చాయి. అనిరుధ్ బీజీఎం విక్రమ్ సినిమాకు ప్రాణం పోసింది. ఇక ఫైనల్ లో సూర్య ఎంట్రీ మ్యాజిక్ చేసింది. మొత్తంగా విక్రమ్ ని లోకేష్ కనకరాజ్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. 

కాగా విక్రమ్ (Vikram)ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. విక్రమ్ విడుదలైన నాలుగు వారాలు పూర్తి కాగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విక్రమ్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించింది. జులై 8 నుండి విక్రమ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. దీంతో విక్రమ్ మూవీ అభిమానులు మరోసారి ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయనున్నారు. ఇక విక్రమ్ కి సీక్వెల్ ఉంటుందని లోకేష్ కనకరాజ్ ప్రకటించిన నేపథ్యంలో అంచనాలు ఏర్పడ్డాయి. 
 

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. అడివి శేష్ డెకాయిట్ నుంచి ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె వరకు
Mankatha Movie: అజిత్ సూపర్ హిట్ సినిమాలో విలన్‌గా విజయ్, ఆ పాత్ర కోసం డైరెక్టర్ ని అడిగితే