త్వ‌ర‌లో క‌మ‌ల్ డ్రీమ్ మూవీ

Published : Dec 15, 2016, 01:51 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
త్వ‌ర‌లో క‌మ‌ల్ డ్రీమ్ మూవీ

సారాంశం

రెండు దశాబ్దాల కిందట కమల్ హాసన్ స్వీయ దర్శకత్వం లో మొదలుపెట్టిన సినిమా  కేవలం మరుదనాయగం మూవీ  ట్రైలర్ షూట్ కోస‌మే 9 కోట్లు ఖర్చు పెట్టిన క‌మ‌ల్ హాస‌న్   ఎట్టకేలకు పునఃప్రారంభమైన మరుదనాయగం సినిమా షూటింగ్ 

 

ఐతే ఎంతో ఆర్భాటంగా మొదలైన ఈ సినిమా.. అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు 30 శాతం షూటింగ్ అయ్యాక సినిమాను ఆపేశాడు కమల్. ఆ తర్వాత సినిమాను మళ్లీ మొదలు పెడతా అంటూనే ఉన్నాడు కానీ.. అలా చూస్తుండగానే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. 

 దీంతో ఈ సినిమా ఎప్పటికైనా బయటికి వస్తుందన్న ఆశతో ఉన్నారు కమల్ అభిమానులు. ఐతే ఎట్టకేలకు ‘మరుదనాయగం’ పునఃప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం రజినీకాంత్-శంకర్ ల ప్రెస్టీజియస్ మూవీ 2.0ను ప్రొడ్యూస్ చేస్తున్న లైకా ప్రొడక్షన్స్ కమల్ కలల సినిమాను టేకప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

లండన్లో ఉండే వ్యాపారవేత్త అయిన కమల్ ఫ్రెండు ఒకరు ఈ ప్రాజెక్టులో భాగస్వామి అవుతున్నాడట. ఇటీవలే లండన్లో తన ఫ్రెండుతో కలిసి కమల్.. లైకా అధినేత సుభాస్కరన్ తో సమావేశం  నిర్వహించాడు. సినిమా ఏ దశలో ఉన్నది.. మిగతా పూర్తి చేయడానికి ఎంత ఖర్చయ్యేది ప్రెజెంటేషన్ ఇచ్చాడట కమల్. త్వరలోనే ఈ ప్రాజెక్టు మళ్లీ సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో?
 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu: `వారణాసి` కోసం మహేష్‌ బాబు సాహసం.. కెరీర్‌లోనే మొదటిసారి ఇలా.. తెలిస్తే గూస్‌ బంమ్స్
850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం