
కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ విక్రమ్. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈసినిమా.. బాక్సాఫీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ తో సంచలనాలు సృష్టించింది. ఇక తమిళంలో ఏకంగా బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రిలీజ్ అయిన ప్రతీ భాషలో.. సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది విక్రమ్ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో నిలిచింది.
విశ్వరూపం తరువాత సినిమాలకు చాలా కాలం దూరం అయ్యాడు కమల్ హాసన్. ఇక కమల్ సినిమాలు వస్తాయా..? రావా..? అనుకున్న టైమ్ లో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడు లోకనాయకుడు. ఇక రీసెంట్ గాఈ సినిమా మరో మైలు రాయిని దాటింది. తాజాగా విక్రమ్ 50రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా రెండు వారాలు ఆడటమే ఎక్కువ. అంతకంటే ఎక్కువ రోజులు ఆడితే అది చాలా పెద్ద విషయం. అలాంటిది విక్రమ్ 50రోజులు పూర్తి చేసుకోవడం మేకర్స్ ను దిల్ కుష్ చేస్తోంది.
దాదాపుగా 4ఏళ్ల తర్వాత కమల్ హాసన్ తెరపై కనిపించడంతో అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా కమల్ కంప్లీట్ యాక్షన్ మూవీ చేయడం అది కూడా ఈ ఏజ్ లో చేయడం... హిట్ కొట్టడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇక
ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పటికి థియేటర్ కలెక్షన్‌లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. రిపీట్ ఆడియన్స్ విక్రమ్ కు ఎక్కువగా ఉన్నారు. మళ్ళీ మళ్ళీ థియేటర్ లో ఈసినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక విక్రమ్ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి దాదాపు 450కోట్లకు పైగా కలెక్షన్‌లను సాధించింది. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్ విషయానికి వస్తే.. హీరో నితిన్ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను రిలీజ్ చేశాడు. విక్రమ్ తెలుగులో 18 కోట్ల వరకు కలెక్షన్‌లు సాధించింది. దీంతో విక్రమ్ సినిమాకు తెలుగులో 10కోట్లకు పైగానే లాభాలు వచ్చాయని తెలుస్తోంది. హీరో నితిన్ ఒక రకంగా ప్రోడ్యూసర్ గా సూపర్ సక్సెస్ కొట్టినట్టే.
పక్కా యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన ఈసినిమాలో మలయాళ స్టార్ యాక్టర్ ఫాహాద్ ఫాజిల్ తో పాటు తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. ఇక క్లైమాక్స్ లో సూర్య రోలెక్స్ క్యారెక్టర్ లో సినిమా అంతటిని ప్రభావితం చేశాడు. ఆయన పాత్రలో 5 నిమిషాలు అయినా చాలా పవర్ ఫుల్ గా ఉంది. సూర్య పాత్ర డిజైన్ నుబట్టి ఈసినిమాకు సీక్వెల్ పక్కా అని తెలుస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.