పోస్టర్ లో ఉంటే సరిపోదు, కేరళ స్టోరీపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్

By Asianet NewsFirst Published May 29, 2023, 9:07 AM IST
Highlights

సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదాశర్మ నటించిన ది కేరళ స్టోరీ చిత్రం వివాదాలు, సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇండియాలో పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

సుదీప్తో సేన్ దర్శకత్వంలో అదాశర్మ నటించిన ది కేరళ స్టోరీ చిత్రం వివాదాలు, సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇండియాలో పలు ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కేరళ స్టోరీ చిత్రం దూసుకుపోతూనే ఉంది. ఏకంగా 200 కోట్ల దిశగా పయనిస్తోంది. ఈ చిత్రంపై అనేక విమర్శలు, ప్రశంసలు కొనసాగుతూనే ఉన్నాయి. 

తాజాగా కేరళ స్టోరీ చిత్రంపై లోక నాయకుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది యదార్థ సంఘటనలతో తెరకెక్కించిన చిత్రం అని టైటిల్ లో, పోస్టర్స్ లో మెన్షన్ చేస్తే సరిపోదు.. ఆ కథ నిజంగానే జరిగి ఉండాలి. అప్పుడే ఆ టైటిల్ కి జస్టిఫికేషన్. కానీ కేరళ స్టోరీ చిత్రం నిజం కాదని కమల్ హాసన్ హాట్ కామెంట్స్ చేశారు. 

కేరళలో మహిళలని ట్రాప్ చేసి ముస్లింలు గా కన్వెర్ట్ చేసి ఆ తర్వాత బలవంతంగా ఉగ్రవాద సంస్థలకు తరలించే దారుణమైన చర్య చాలా కాలంగా జరుగుతోందనే అంశంతో దర్శకుడు సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇది ఒక ప్రాపగాండా చిత్రం మాత్రమే అని ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు విమర్శిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ కూడా కేరళ స్టోరీని ప్రాపగాండా చిత్రంగా అభివర్ణించారు. 

కమల్ హాసన్ కామెంట్స్ పై డైరెక్టర్ సుదీప్తో సేన్ గుప్తా స్పందించారు. అలంటి వ్యాఖ్యలు చేసే వారిపై నేను స్పందించను. ఎందుకంటే సినిమా చూడకముందు ఇది ప్రాపగాండా చిత్రం అని మాట్లాడిన వాళ్ళు కూడా.. మూవీ చూశాక ప్రశంసించారు. సినిమా ఎక్కువ శాతం మందికి నచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ పట్టించుకోవలసిన అవసరం లేదు. ముఖ్యంగా సినిమా చూడకుండా మాట్లాడే వాళ్లని పట్టించుకోనక్కర్లేదు అంటూ సుదీప్తో సేన్ స్పందించారు. 

అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని వసూళ్లు రాబడుతోంది. అయితే వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.   

click me!