#Kalki2898AD:'కల్కి' లేటెస్ట్ అప్డేట్..కమల్ ఇలా షాక్ ఇచ్చాడేంటి?

By Surya PrakashFirst Published Mar 25, 2024, 10:41 AM IST
Highlights

ఈ వార్త కమల్ అభిమానులకే కాకుండా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్ ఇచ్చినట్లు అయ్యింది.  


 ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కె’పై అప్డేట్స్  కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనెని హీరోయిన్ గా చేస్తూండగా అమితాబ్ బచ్చన్, దిశా పటాని కూడా సినిమాలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో కమల్ హాసన్ ఎంట్రీ కల్కి పై మరింత బజ్ పెరిగేలా చేసింది. అయితే ఇప్పుడు కమల్ ఓ ట్విస్ట్ ఇచ్చారు. 

కమల్ హాసన్ ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక The Hindu తో మాట్లాడుతూ తన పాత్ర కేవలం గెస్ట్ అని తేల్చేసారు.  “నేను ఇండియన్ 2,ఇండియన్ 3 షూటింగ్ పూర్తి చేసాను . త్వరలో  మణిరత్నం థగ్ లైఫ్   షూట్ లో పాల్గొని పూర్తి చేస్తారు. అలాగే నేను కల్కిలో గెస్ట్ గా చేస్తున్నాను  ,” అన్నారు. ఈ వార్త కమల్ అభిమానులకే కాకుండా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. కమల్ పాత్ర ఇలా గెస్ట్ అనేది ఎవరూ ఊహించలేదు. ప్రొడక్షన్ హౌస్ గతంలో ఈ సినిమాలో విలన్ గా కమల్ చేస్తున్నారని చెప్పింది.  

అయితే ఈ సినిమాలో కమలహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అంటున్నారు.  కొన్ని రోజులుగా కమల్ - ప్రభాస్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రభాస్ - కమల్ కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సాంకేతిక పరంగా ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపిస్తుందని అంటున్నారు. మరో ప్రక్క ప్రభాస్ విష్ణుమూర్తి పాత్రలో కనిపిస్తారనే (Prabhas Plays Lord Vishnu)వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ సర్క్యులేట్ అవుతోంది.

నాగ్ అశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 
 
 ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు .. ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ పనులు వేగాన్ని పుంజుకున్నాయి. మరోవైపు కల్కి ప్రాజెక్ట్ గురించి నిత్యం.. సోషల్ మీడియాలో ఆసక్తిరక విషయాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.  కల్కి తో పాటు రాజాసాబ్, సలార్ పార్ట్ 2, స్పిరిట్ చిత్రాలు .. ప్రభాస్ కు క్యూలో ఉన్నాయి.  

click me!