నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నెక్ట్స్ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ఫస్ట్ గ్లింప్స్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందించారు.
‘బింబిసార’తో సాలిడ్ హిట్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తర్వాత వరుస చిత్రాలతో అలరిస్తూ వస్తున్నారు. గతంలో ఎన్నో ఫ్లాప్స్ ను చవిచూసిన కళ్యాణ్ రామ్ ఏమాత్రం దిగులు చెందకుండా సినిమాలపై మక్కువతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో వస్తూనే ఉన్నారు. ఇక Bimbisara రూపంలో సాలిడ్ హిట్ అందింది. చివరిగా ‘అమిగోస్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం అనుకున్న మేర ఫలితానివ్వలేకపోయింది.
ఇక ప్రస్తుతం మరో డిఫరెంట్ మూవీ చేస్తున్నారు. ఆ చిత్రమే Devil. ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానులు ఈ చిత్రం కోసమే ఎదురుచూస్తున్నారు. అయితే మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న టీమ్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా సూపర్ న్యూస్ అందించారు.
‘డేవిల్’ చిత్రం ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరేదీ రాలేదు. ఇక తాజాగా గ్లింప్స్ ను రెడీ చేసినట్టు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. జూలై 5న (రేపు) ఈ అప్డేట్ రానుందని తెలిపారు. కానీ పక్కా టైమ్ ను ఫిక్స్ చేయలేదు. మొత్తానికి రేపటి నుంచి ‘డేవిల్’ కు సంబంధించిన అప్డేట్స్ వరుసగా అందనున్నాయి. ఈ సినిమాలోనూ నెగెటీవ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.
ఇక అప్డేట్ అందిస్తూ వదిలిన మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ ఉంది. టైప్ రైటింగ్, పలు పరికరాలతో దేనికోసమో శోదిస్తూ.. నోట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఇక మూవీ స్టోరీ లైన్ ఏంటనేది రేపు వచ్చే గ్లింప్స్ కాస్తా క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నవీన్ మేడారం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
Get a glimpse into the world of a fearless British secret agent on a mission to unravel a dark mystery! 🔥
A Film by ABHISHEK PICTURES pic.twitter.com/jLDoRNrJ14