`డెవిల్‌` అసలు ట్విస్ట్ లీక్‌ చేసిన కళ్యాణ్‌ రామ్‌.. క్లైమాక్స్ లో అదే హైలైట్‌!

Published : Dec 27, 2023, 06:31 PM IST
`డెవిల్‌` అసలు ట్విస్ట్ లీక్‌ చేసిన కళ్యాణ్‌ రామ్‌.. క్లైమాక్స్ లో అదే హైలైట్‌!

సారాంశం

`డెవిల్‌` సినిమాలోని అసలు విషయాన్ని లీక్‌ చేశాడు కళ్యాణ్‌ రామ్‌. సినిమాలో క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుంది. అక్కడ ట్విస్ట్ ఉంటుందన్నారు. దీంతో ఇది ఇంట్రెస్టింగ్ గా మారింది.

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `డెవిల్‌`. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి నిర్మాత అభిషేక్‌ నామా రూపొందించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా గురించి కళ్యాణ్‌ రామ్‌ ఆసక్తికర విషయాలను రివీల్‌ చేశాడు. సినిమా రైటర్‌ శ్రీకాంత్‌ విస్సా ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయినట్టు చెప్పాడు. థ్రిల్లర్‌ని, కమర్షియల్‌ ఎలిమెంట్లని మేళశింపుగా ఈ కథని డిజైన్‌ చేశాడని, అది తనకు ఎంతో కొత్తగా, థ్రిల్లింగ్‌గా అనిపించిందన్నారు. ఇలాంటి కమర్షియల్‌ అంశాలను, థ్రిల్లర్‌ని బ్లెండ్‌ చేసి కథ రాయడం చాలా కష్టం. చాలా అరుదు. కానీ శ్రీకాంత్‌ చెప్పినప్పుడు వాహ్‌ అనిపించిందన్నారు. 

ఈ సందర్భంగా అసలు విషయాన్ని లీక్‌ చేశాడు కళ్యాణ్‌ రామ్‌. సినిమాలో క్లైమాక్స్ హైలైట్‌గా ఉంటుంది. అక్కడ ట్విస్ట్ ఉంటుందన్నారు. అయితే ట్రైలర్‌లో చివర్లో కళ్యాణ్‌ రామ్‌.. `నువ్వు చెప్పినట్టు వినడానికి కుక్కని అనుకున్నావా రా.. లయన్‌` అంటూ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఆయన కామెంట్స్, ట్రైలర్‌ని బట్టి చూస్తే అప్పటి వరకు బ్రిటీష్‌ఏజెంట్‌గా ఉన్న కళ్యాణ్‌ రామ్‌ చివర్లో ట్విస్ట్ ఇస్తూ తన పాత్రలోని మరో కోణాన్ని బయటపెడతారని తెలుస్తుంది. ఓ మర్డర్‌ కేసులో విచారించేందుకు వెళ్లిన ఆయన అక్కడ అనేక విషయాలు తెలుసుకుంటాడు. కానీ చివర్లో మాత్రం రూట్‌ మారుస్తాడని తెలుస్తుంది. క్లైమాక్స్ లో ఇండియాకి పనిచేసే వ్యక్తిగా కనిపిస్తారని, ఆ సమయంలో ఆయన దేశభక్తిని చాటుతారని తెలుస్తుంది. మరి ఇదే నిజమైతే సినిమాలో అది అదిరిపోతుందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే `డెవిల్‌` మూవీ ఈ ఏడాదికి ఫినిషింగ్‌ టచ్‌ ఇవ్వబోతుంది. ఈ సంవత్సరాంతంలో వచ్చే పెద్ద సినిమా ఇదే. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. 12 మిలియన్ వ్యూస్‌ను దాటి ట్రైలర్ దూసుకెళ్తోంది.  ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్‌లో చూడని సరికొత్త డైమన్షన్‌ను `డెవిల్` చిత్రంలో దర్శక నిర్మాత అభిషేక్ నామా ఆవిష్కరిస్తుండటం కొసమెరుపు. బ్రిటీష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారనే విషయాన్ని అసలు ఎవరూ ఊహించలేరు. అలాంటి కొత్త విషయాన్ని డెవిల్ మూవీలో ఆవిష్కరిస్తుండటం విశేషం.

 సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా `డెవిల్` రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు. ప్రతి ఫ్రేమ్‌ని రిచ్‌గా అప్పటి బ్రిటీష్ కాలాన్ని ఆవిష్కరించారు. మేకింగ్ పరంగా బడ్జెట్ విషయంలో నిర్మాత అభిషేక్ నామా ఎక్కడా రాజీపడలేదని స్పష్టమవుతోంది.  సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, గాంధీ నడికుడికర్ ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటున్నాయి. వీటన్నింటిని నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లేలా హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన నేపథ్య సంగీతం ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి నవీన్‌ మేడారం దర్శకత్వం వహించారని, కానీ ఆయన్ని తప్పించినట్టు తాజాగా ఓ బహిరంగ లేఖని పంచుకున్నారు నవీన్‌. ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు