అల్లు అర్జున్ తో అట్లీ యాక్షన్‌ అడ్వెంచర్ మూవీ..? జవాన్ ను మించిపోతుందట..?

Published : Dec 27, 2023, 06:06 PM IST
అల్లు అర్జున్ తో  అట్లీ  యాక్షన్‌ అడ్వెంచర్ మూవీ..? జవాన్ ను మించిపోతుందట..?

సారాంశం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ..అద్భుతమైన సినిమా చేయబోతున్నాడట అట్లీ, బాలీవుడ్ లో భారీ స్థాయిలో చేసిన జవాన్.. బ్లాక్ బస్టర్ అవ్వడంత్.. ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు యంగ్ డైరెక్టర్.   

స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్. పుష్పతో పాన్ ఇండియాతో పాటు. వరల్డ్ స్థాయిలో ఇమేజ్ అతని సొంతం అయ్యింది. అంతే కాదు జాతీయ అవార్డ్ కూడా సాధించాడు. తెలుగులో ఏ హీరో కూడా ఇంతక వరకూ బెస్ట్ హిరోగా  జాతీయా అవార్డ్ సాధించలేదు. అది సాధించి చూపించిండు బన్నీ. ఇక ఈక్రమంలో అల్లు అర్జున్ తో సినిమా లుచేయడానికిబాలీవుడ్, కోలీవుడ్ నుంచి దర్శకులు పోటీ పడుతున్నారట. అయితే బన్నీ మాత్రం నెక్ట్స్ మూవీ సందీప్ రెడ్డి వంగాకు కమిట్ అయ్యాడు. 

ఈక్రమంలో అల్లు అర్జున్ కు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తమిళ దర్శకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి.. సూపర్ హిట్ తమిళ సినిమాలు చేసిన దర్శకుడు అట్లీ. అయితే రీసెంట్ గా అట్లీ బాలీవుడ్ లో అడుగు పెట్టి.. అక్కడ రికార్డ్ లు బ్రేక్ చేశాడు. బాలీవుడ్ ను ఏలిన బాద్ షాకే కష్టకాలంలో అండగా నిలబడి.. షారుక్ ను హీరోగా మళ్ళీ నిలబెట్టాడు జవాన్ సినిమాతో. ఈసినిమా అక్కడ వెయ్యి కోట్ల పైన సాధించింది. ఇక అట్లీకి టాలీవుడ్ సినిమా చేయాలని ఎప్పటినుంచో కోరిక. అందులోను అల్లు అర్జున్ తో సినిమాపై ఒకటీ రెండు సార్లు స్పందించాడు కూడా.. 

సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న శృతీ హాసన్..? శాంతను హజారికాతో మూడుముళ్లు.. నిజమేనా..?

ఇక త్వరలోనే ఈ కాంబినేషన్‌ సెట్‌ అవ్వనున్నట్టు ఫిలింవర్గాల సమాచారం.అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం తన దృష్టి అంతా పుష్ప2 సినిమాపై పెట్టాడు. ఈసినిమాను ఎలాగైనా హిట్ చేయాలి. ప్రమాణాలుపెంచి..ఎలాగైనా ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసి..పుష్ప2ను ఆస్కార్ లరేంజ్ లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈక్రమంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనకడుగు వేయడం లేదు ఐకాన్ స్టార్. ఈక్రమంలో బన్నీ నెక్ట్స్ సినిమాపై రకరకరాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఎన్టీఆర్ దేవర టీజర్‌ రెడీ.. హింట్ ఇచ్చిన అనిరుధ్‌.. దిల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..

బన్ని వెంటనే మా సినిమా చేయాలంటూ దర్శఖులు పోటీపడుతున్నారట. తర్వాత బన్నీ త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. అయితే, ఆ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ లోపు అట్లీతో సినిమా చేయడానికి అల్లు అర్జున్‌ రెడీ అయినట్టు తెలుస్తున్నది. ఈ యాక్షన్‌ అడ్వంచరస్‌ మూవీని సాథ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని సంకల్పించారట దర్శకుడు అట్లీ. అనిరుధ్‌ సంగీత దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి