
తెలుగులోనే కాదు, ఇండియాలోనే ఇప్పుడు రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలో `కల్కి2898ఏడీ` మొదటి స్థానంలో ఉంటుంది. సుమారు ఐదు నుంచి, ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. వైజయంతి పిక్చర్స్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, నయనతార, మృణాల్ ఠాకూర్ వంటి తారలు గెస్ట్ లుగా మెరవబోతున్నారు.
సినిమా వచ్చే నెలలో రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది యూనిట్. ఇటీవల ప్రభాస్ వాడే వాహనాన్ని పరిచయం చేసింది. `బుజ్జి` పేరుతో ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాన్ని పరిచయం చేశారు. అయితే జస్ట్ చూపించీ చూపించనట్టుగా చూపించి సస్పెన్స్ లో పెట్టారు. త్వరలోనే చూపిస్తామని తెలిపారు. తాజాగా దానికోసం ప్రత్యేకంగా ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. ఆర్‌ఎఫ్‌సీలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది యూనిట్.
ఈ సినిమాకి సంబంధించిన మొత్తంగా నాలుగు ఈవెంట్లు ప్లాన్ చేశారట. ఒక్కో స్టేట్‌లో ఒక్కో ఈవెంట్ అనుకుంటున్నారట. అందులో భాగంగా తెలుగులో రామోజీ ఫిల్మ్ సిటీలో రేపు భారీ ఈవెంట్ చేస్తున్నారు. సాయంత్రం నుంచి ఇది జరుగనుంది. గతంలో `బాహుబలి`, `సాహో` వంటి ఈవెంట్లు ఇక్కడే నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ అక్కడే భారీ ఈవెంట్‌ని ప్లాన్ చేయడం విశేషం. `బాహుబలి` సెంటిమెంట్ ని రిపీట్ చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే ఈ `కల్కి2898ఏడీ` ఈవెంట్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో భైరవ పాత్రలో నటించిన ప్రభాస్ వాడిని వాహనం బుజ్జిని పరిచయం చేయబోతున్నారు. అసలు ఆ వాహనం ఏంటి? ఎలా తయారు చేశారు. దాన్ని ఎలా ఉపయోగించారు. అనే విషయాలను ఇందులో తెలియజేయబోతున్నారు. దీంతో ఈవెంట్‌పై ఆసక్తినెలకొంది. అయితే నాలుగు లొకేషన్లలో నాలుగు మెయిన్ వస్తువులను, వాహనాలనుగానీ పరిచయం చేయబోవుతున్నారట. అవేంటనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే `కల్కి` నుంచి ఇప్పటి వరకు వచ్చిన స్టఫ్ ఏదీ ఆకట్టుకునేలా లేదు. నాగ్ అశ్విన్ డిజప్పాయింట్ చేయడు అనే నమ్మకం ఆయనపై ఉంది. మరి ఏం చేస్తాడో చూడాలి.