‘రణరంగం’లో కాజల్ క్యారక్టర్, కమిటవ్వటానికి కారణం!

By AN TeluguFirst Published Aug 12, 2019, 10:20 AM IST
Highlights

 కాజల్ ‘రణరంగం’ సినిమాలో డాక్టర్‌గా చేశారు. ఈ చిత్రంలో ఆమెది పెద్ద పాత్ర కాదు కానీ, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఆమె ఫస్టాఫ్ లో ఉండదు. కేవలం సెకండాఫ్ లోనే ఓ ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కనపడుతుంది. 

శర్వానంద్‌ హీరోగా, కాజల్‌ అగర్వాల్, కళ్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్లుగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ స్పెషల్ పాత్ర చేసిందని, అదే మెయిన్ ట్విస్ట్ ఇస్తుందని వినికిడి. దాంతో  కాజల్ చేసిన పాత్ర ఏమిటి అనే విషయమై ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో కాజల్ ‘రణరంగం’ సినిమాలో డాక్టర్‌గా చేశారు. ఈ చిత్రంలో ఆమెది పెద్ద పాత్ర కాదు కానీ, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే ఆమె ఫస్టాఫ్ లో ఉండదు. కేవలం సెకండాఫ్ లోనే ఓ ఫ్లాష్ బ్యాక్ లో ఆమె కనపడుతుంది. ఆమె పాత్ర మెయిన్ ట్విస్ట్ అయి, కథను పూర్తి స్దాయిలో మలుపు తిప్పుతుంది. శర్వా డాన్ గా కనిపిస్తాడు. కథ గ్రిప్పింగ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కథని ముందుకు తీసుకెళ్లే పాత్ర ఆమెది.. అందుకే చిన్నదైనా ఒప్పుకుని చేసిందట. 

సినిమా విషయానికి వస్తే.. గ్యాంగ్‌స్టర్‌గా ఈ చిత్రంలో శర్వానంద్ పోషించిన పాత్ర ఆయన గత చిత్రాలకు భిన్నంగా ఉండటమే కాకుండా ఎంతో వైవిధ్యంగానూ, ఎమోషన్స్ కూడి ఉంటుందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. ‘గ్యాంగ్‌స్టర్’ అయిన వ్యక్తి జీవితంలో 1990, ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ ‘రణరంగం’ అని  అంటున్నారు. 

 

click me!