కాజల్ ప్రవర్తనపై మీడియా ఫైర్!

Published : Dec 04, 2018, 01:11 PM IST
కాజల్ ప్రవర్తనపై మీడియా ఫైర్!

సారాంశం

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో తన హవా సాగిస్తోంది. ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా కాలం గడుపుతోంది. తాజాగా ఆమె ప్రవర్తనతో విసుగుపోయిన తెలుగు మీడియా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో తన హవా సాగిస్తోంది. ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా కాలం గడుపుతోంది. తాజాగా ఆమె ప్రవర్తనతో విసుగుపోయిన తెలుగు మీడియా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అసలు విషయంలోకి వస్తే.. 'కవచం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ అని పీఆర్ టీమ్ చెప్పడంతో సమయానికి చేరుకున్నారు మీడియా సభ్యులు. కానీ కాజల్ ఎంతసేపటికీ అక్కడకి రాకపోవడంతో బాయ్ కాట్ చేసి అక్కడ నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. 

పీఆర్ టీమ్ 10:30 కి కాజల్ కి ఫోన్ చేయగా.. ఆమె పది నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పిందట. అలా చెప్పిన గంటన్నరకి ఆమె ప్రెస్ మీట్ కి చేరుకుందట. అప్పటికే విసిగిపోయిన విలేకర్లు ఇంటర్వ్యూ నుండి వెళ్లిపోయారట. కొందరు రిపోర్టర్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం.

సీనియర్ రిపోర్టర్లంతా కాజల్ పై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ బాధ్యత లేకుండా ఆమె ప్రవర్తించడంతో మండిపడుతున్నారు. పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె మర్యాదపూర్వకంగా నడుచుకోవాల్సింది పోయి ఈ విధంగా ప్రవర్తిస్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

PREV
click me!

Recommended Stories

Peddi ఫస్ట్ హాఫ్ లాక్.. రిలీజ్ కి నెలల ముందే మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్, ఇక అంతా ఆయన చేతుల్లోనే
Parasakthi: సంక్రాంతి ఫ్లాప్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోందా.. రిలీజ్ డేట్ ఇదేనా ?