బాలయ్యతో తొలిసారి చందమామ కాజల్ ఫిక్స్.. షూటింగ్ గురించి క్రేజీ అప్డేట్ ?

Published : Jan 28, 2023, 12:16 PM IST
బాలయ్యతో తొలిసారి చందమామ కాజల్ ఫిక్స్.. షూటింగ్ గురించి క్రేజీ అప్డేట్ ?

సారాంశం

నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకులని అలరించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో ప్రేక్షకులని అలరించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బాలయ్య తన తదుపరి చిత్రం కోసం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఎన్బీకే 108గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. 

అనిల్ రావిపూడి వినోదాత్మక చిత్రాలు తెరకెక్కించడంలో స్పెషలిస్ట్. బాలయ్య అంటే మాస్ ఎక్కువగా ఉండాలి. సో అనిల్ కామెడీ మాస్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. అయితే హీరోయిన్ల విషయంలో ఇంకా క్లారిటీ లేదు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీలో బాలయ్యకి జోడిగా కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్ బాలయ్య సరసన నటించేది దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది. 

ఇదే జరిగితే బాలయ్య, కాజల్ కలసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య , శ్రీలీల, జైలు సన్నివేశాలు కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది. 

మితిమీరే విధంగా ఫైట్స్ లేకుండా.. 3 మాస్ ఫైట్స్ ని అనిల్ రావిపూడి సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మొత్తం తెలంగాణలోనే జరుగుతుంది అట. త్వరలో కాజల్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు