మోదీని కూడా పడేశావా.. కాజల్ పై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

Published : May 31, 2019, 12:04 PM IST
మోదీని కూడా పడేశావా.. కాజల్ పై నెటిజన్ల ఫన్నీ కామెంట్స్!

సారాంశం

భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 

భారతదేశ 15వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనతో రాష్ట్రపతి ప్రాంగణంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో హాజరైన రాజకీయ, అధికార, అనధికార ప్రముఖులు, సినిమా ప్రముఖులు, బిజినెస్ మెన్ లు చాలా  మంది హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు వెళ్లలేకపోయినందుకు బాధ పడుతున్నానని హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది.

పీఎం ఆఫీస్ నుండి తనకు వచ్చిన ఇన్విటేషన్ ని పోస్ట్ చేసిన ఆమె.. ఈ ఆహ్వానం అందుకున్నందుకు చాలా గర్వంగా ఉందని, కానీ వేడుకకు హాజరు కాలేకపోయానని తెలిపింది. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి  హాజరులేకపోవడం బాధగా ఉందని తెలిపింది.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు.. కాజల్ కి రాజకీయాల్లో కూడా ఫాలోయింగ్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే.. మోదీని కూడా పడేశావా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Allu Arjun: స్టార్ హీరో కొంపముంచిన అల్లు అర్జున్, క్రేజీ సినిమా ఆగిపోయింది ?
Kriti Sanon: చెల్లి పెళ్లిలో తన ప్రియుడిని పరిచయం చేసిన కృతి సనన్ ? క్రేజీ ఫోటోలు వైరల్