పెళ్ళిలో ఆ పద్ధతులు స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాం అంటున్న కొత్త పెళ్లికూతురు కాజల్

Published : Nov 01, 2020, 11:19 AM IST
పెళ్ళిలో ఆ పద్ధతులు స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాం అంటున్న కొత్త పెళ్లికూతురు కాజల్

సారాంశం

తన పెళ్ళిలో కోవిడ్ నిబంధనలు స్ట్రిక్ట్ పాటించినట్లు కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్టులు నిర్వహించడం జరిగింది అన్నారు. పెళ్లి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు, వివాహానికి హాజరుకాని వారిని చాలా మిస్సైనట్లు ఆమె తెలిపారు. అలాగే త్వరలో వారిని కలుస్తానని చెప్పడం జరిగింది.  

అభిమానుల గుండె బరువు మధ్య కాజల్ అగర్వాల్ యువ పారిశ్రామికవేత్త గౌతమ్ కిచ్లు సొంతం అయ్యింది. నాలుగేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న ఈ ప్రేమ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అక్టోబర్ 30వ తేదీన కాజల్ అగర్వాల్ వివాహం అత్యంత సన్నిహితులు, బంధువులు మధ్య జరిగింది. పెళ్లికూతురిగా కాజల్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన లెహంగా, ఆభరణాలు ధరించి మెరిసిపోయారు. ఆమె గ్రాండ్ లుక్ మహారాణిని తలపించింది. 

ఇక తన పెళ్ళిలో కోవిడ్ నిబంధనలు స్ట్రిక్ట్ పాటించినట్లు కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికి కోవిడ్ టెస్టులు నిర్వహించడం జరిగింది అన్నారు. పెళ్లి హాజరైన వారికి కృతజ్ఞతలు తెలపడంతో పాటు, వివాహానికి హాజరుకాని వారిని చాలా మిస్సైనట్లు ఆమె తెలిపారు. అలాగే త్వరలో వారిని కలుస్తానని చెప్పడం జరిగింది.

ఇక కాజల్ భర్త గౌతమ్ తో కలిసి హనీమూన్ ప్లానింగ్స్ లో ఉందని సమాచారం. త్వరలో ఆమె షూటింగ్స్ లో పాల్గొనాల్సి ఉండగా ఈ లోపే హనీమూన్ ముగించుకొనే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా  కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే భారతీయుడు 2, మోసగాళ్లు సినిమాలలో కాజల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా