బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్: పదహారేళ్ళ పాప పాత్రలో కాజల్

Published : Aug 30, 2019, 01:11 PM IST
బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్: పదహారేళ్ళ పాప పాత్రలో కాజల్

సారాంశం

సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోయిన్స్ లలో కాజల్ ఒకరు. యంగ్ హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా చందమామ రేంజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇక చాలా కాలం తరువాత కాజల్ కి బాలీవుడ్ లో మంచి అఫర్ దక్కింది.   

గ్యాంగ్ స్టర్ మాఫియా కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ముంబై సాగా. జాన్ అబ్రాహం - ఇమ్రాన్ హష్మీ అలాగే మరికొంత మంది ప్రముఖ బాలీవుడ్ స్టార్స్ సినిమాలో నటిస్తున్నారు. అయితే  ఈ సినిమాలో కాజల్ జాన్ అబ్రహంకి జోడిగా నటించనుంది. ఆమె మూడు విభిన్న గెటప్పుల్లో కనిపిస్తుందని టాక్. 

ముఖ్యంగా అప్పుడే 16 ఏళ్ల వయసు దాటినా యంగ్ గర్ల్ గా కాజల్ కనిపించిననున్నట్లు తెలుస్తోంది. ఇక మరో రెండు డిఫరెన్స్ గెటప్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటాయట. ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ముంబై సాగా వచ్చే ఏడాది సమ్మర్ ఎండింగ్ జూన్ లో వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలో కాజల్ బాలీవుడ్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌