మరో రికార్డుతో షాకిచ్చిన కబీర్ సింగ్!

Published : Jul 13, 2019, 05:08 PM IST
మరో రికార్డుతో షాకిచ్చిన కబీర్ సింగ్!

సారాంశం

  బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హావా మాములుగా లేదు. కబీర్ సింగ్ సెట్స్ పైకి వచ్చినప్పుడు ఈ తెలుగు కథకు తెలుగు దర్శకుడు ఎందుకని.. ఆ కథకు అంత సీన్ లేదని నెగిటివ్ కామెంట్స్ గట్టిగానే వచ్చాయి.

బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ హావా మాములుగా లేదు. కబీర్ సింగ్ సెట్స్ పైకి వచ్చినప్పుడు ఈ తెలుగు కథకు తెలుగు దర్శకుడు ఎందుకని.. ఆ కథకు అంత సీన్ లేదని నెగిటివ్ కామెంట్స్ గట్టిగానే వచ్చాయి. పైగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు అనగానే ఎదో అలా ఆడేసి వెల్లిపోతుందని తక్కువ చేసి మాట్లాడినవారున్నారు. 

అయితే ఆ విమర్శలన్నటికి కౌంటర్ ఇచ్చేలా కబీర్ సింగ్ అదిరిపోయే కలెక్షన్స్ ని అందించింది. 250కోట్లను దాటేసి దెబ్బకు దెబ్బ తీసింది. సినిమాపై ఇప్పటికి కూడా విమర్శలు తగ్గడం లేదు. అయినప్పటికీ కబీర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతూనే ఉంది. సందీప్ వంగతో ఒక సినిమా చేయాలనీ అక్కడి బడా నిర్మాతలు క్యూ కట్టారు. 

ఇలానే సినిమా కలెక్షన్స్ కొనసాగితే 300కోట్ల మార్క్ ను అందుకుంటుంది. అయితే విశ్లేషకుల అంచనాల ప్రకారం కబీర్ సింగ్ 270కోట్లకు ఎండ్ అవుతుందని టాక్. బాలీవుడ్ టాప్ 10 హిట్స్ లో స్థానం సంపాదించుకొని నెగిటివ్ ప్రచారాలకు కబీర్ సింగ్ సరైన కౌంటర్ ఇచ్చాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా