1500కోట్ల రామాయణ.. ఎన్టీఆర్ అయితే బెస్ట్!

Published : Jul 13, 2019, 04:40 PM IST
1500కోట్ల రామాయణ.. ఎన్టీఆర్ అయితే బెస్ట్!

సారాంశం

అల్లు అరవింద్ ఇటీవల బాలీవుడ్ బడా నిర్మాతలతో కలిసి అఫీషియల్ గా రామాయణను సెట్స్ పైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ 1500కోట్ల ప్రాజెక్ట్ లో రాముడి పాత్ర కోసం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు అందరిలో ఎంతో ఆసక్తిని రేపుతోంది.   

రీసెంట్ గా రామ్ చరణ్ అని టాక్ వచ్చినప్పటికీ అందుకు ఆ మెగా యువ హీరో ఒప్పుకునే పరిస్థితుల్లో లేడని ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక చాలా మంది సినీ ప్రేక్షకులు మాత్రం ఆ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే న్యాయం చేయగలడని చెబుతున్నారు. తారక్ ఇదివరకే చిన్నతనంలో బాల రామాయణంలో నటించి తానేంటో నిరూపించుకున్నాడు. 

ఇక యముడిగా - రావణుడిగా అప్పుడపుడు హిస్టారికల్ పాత్రలను టచ్ చేస్తూనే ఉన్నాడు. అప్పుడే అతని టాలెంట్ ఏమిటో తెలిసిపోయింది. అందుకే తారక్ అయితే బెస్ట్ అంటూ సౌత్ ఆడియెన్స్ డిమాండ్ చేస్తున్నారు,. కానీ అల్లు అరవింద్ గ్యాంగ్ మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోను రాముడి పాత్ర కోసం సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌