
ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘జై లవ కుశ’. ఇటీవల ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే జైలవకుశ చిత్ర బృందం సక్సెస్ మీట్ ని కూడా జరుపుకుంది. ఆ సమయంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా కూడా మారాయి. సినిమాని పేషెంట్ గానూ, మూవీ క్రిటిక్స్ ని దారిన పోయే దానయ్యలుగా తారక్ సంభోదించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మీడియా చేసిన రచ్చ చూసి.. ఇంకెప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్.
అంతేకాదు.. ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి.. మూవీ క్రిటిక్స్ కి క్షమాపణలు కూడా చెప్పాలనుకుంటున్నాడట తాను మాట్లాడింది కొందరి గురించే అయినా.. అందరినీ అన్నట్లు మీడియా భావిస్తోందని.. అందుకే క్షమాపణలు చెప్పాలని భావిస్తున్ట్నట్లు సమాచారం. అయినా..సినీ నటులకు మీడియాతో కచ్చితంగా అవసరం ఉంటుంది. వారి సినిమాలను ప్రమోట్ చేసుకోవాలంటే కచ్చితంగా మీడియా అవసరం ఎంతో ఉంది. వారితో గొడవలు పెట్టుకుంటూ కుర్చుంటే.. నష్టం హీరోలకే. ఆ విషయాన్ని గ్రహించే తారక్ ఈ నిర్ణయం తీసుకున్నాడని టాలీవుడ్ లో టాక్.