ఈ చిత్రం ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో..ఆ షెడ్యూల్ డిటేల్స్ చూస్తే...
ఈ 2024 సంవత్సరంలో తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న పెద్ద సినిమాలలో దేవర ఒకటి. చిరంజీవి తో చేసిన ఆచార్య వంటి మెగా డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ చేస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కసిగా దేవర సినిమాకి వర్క్ చేస్తున్నారు. అలాగే ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత ఎన్టీఆర్ దేవరగా రాబోతున్నారు. దీంతో అన్ని వైపుల నుంచి సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూపులు అయితే చెప్పక్కర్లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఎంతవరకూ వచ్చింది. ఎంత పెండింగ్ ఉంది అనే విషయం అప్డేట్ ఇవ్వబోతున్నాం. ఈ చిత్రం ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందో..ఆ షెడ్యూల్ డిటేల్స్ చూస్తే...
అందుతున్న సమాచరం మేరకు దేవర పార్ట్ వన్ లో మొత్తం ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ పూర్తైంది. అలాగే కొంత మైనర్ పార్ట్ తప్పిస్తే టాకీ కూడా పూర్తి. అయితే సినిమాలో ఉన్న ఐదు పాటల్లో ఒకటి మాత్రమే ఇప్పటికి తెరకెక్కించారు. మిగిలిన నాలుగు డ్యూయిట్స్ అవి పెండింగ్. రాబోయే వారాల్లో అవి పూర్తి చేస్తారు. అన్ని కలిపి 30 నుంచి 35 రోజుల్లో పూర్తవుతుంది. ఈ వర్క్ పూర్తైన దాన్ని బట్టి రిలీజ్ డేట్ ఫైనల్ చేసి ప్రకటిస్తారని తెలుస్తోంది.
పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రెండు భాగాల్లో ఇది రానుంది. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ పాత్రలో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కనిపించనున్నారు. సముద్రతీరం నేపథ్యంలో.. భయం అనే అంశం ప్రధానంగా సాగే చిత్రమిది. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఆంద్రలోని నిర్లక్ష్యం చేయబడ్డ సముద్ర తీర ప్రాంతాల గురించి ఉంటుంది. దాంతో సినిమాలో ఎక్కువ భాగం సముద్రం కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో సైఫ్ అలీ ఖాన్ భైరవుడు అనే పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ ‘దేవర’గా కనిపించనున్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఫర్గాటెన్ లాండ్స్ లో, క్రూర మృగాలకి కూడా భయపడని మనుషులు ఉంటారు. జాలి అనేదే లేని ఆ మృగాల్లాంటి మనుషులని భయపెట్టేది ఒకరే, అతనే ఎన్టీఆర్ అంటూ కొరటాల శివ ‘ఎన్టీఆర్ 30’ అనౌన్స్మెంట్ రోజునే అంచనాలు పెంచేసాడు. ఈ సినిమాకి నిర్మాత ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) , కొసరాజు హరికృష్ణ (Kosaraju Harikrishna) లు.