రాజమౌళి కొమురం భీమ్.. అంతకుమించి!

Published : Jul 09, 2019, 01:08 PM IST
రాజమౌళి కొమురం భీమ్.. అంతకుమించి!

సారాంశం

జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం తన శక్తిని మొత్తం దారపోస్తాడని టాలీవుడ్ దర్శకులందరికి తెలిసిందే. అందుకే తారక్ కి కథ సెట్టయ్యేలా ఉంటె  వెంటనే అతని డేట్స్ కోసం ఎగబడతారు. 

జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం తన శక్తిని మొత్తం దారపోస్తాడని టాలీవుడ్ దర్శకులందరికి తెలిసిందే. అందుకే తారక్ కి కథ సెట్టయ్యేలా ఉంటె  వెంటనే అతని డేట్స్ కోసం ఎగబడతారు. తారక్ కూడా సినిమా చేయడానికి ఒప్పుకుంటే దర్శకుడి ఊహలకు మించిన రేంజ్ లో అవుట్ ఫుట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. 

అరవింద సమేతలో న్యాచురల్ గా కనిపించినా పరవాలేదు అని త్రివిక్రమ్ చెప్పినప్పటికీ.. సిక్స్ ప్యాక్ ట్రై చేసి పాత్రకు మరింత బలాన్ని ఇచ్చాడు. ఇక ఇప్పుడు రాజమౌళి కోసం జూనియర్ ఎన్టీఆర్ జిమ్ లో నిత్యం వర్కౌట్స్ చేస్తున్నాడు. కోచ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో RRR కొమురం భీమ్ పాత్ర కోసం బాడీని సెట్ చేసుకుంటున్నాడు. 

రీసెంట్ గా జిమ్ లో హార్డ్ గా తారక్ కష్టపడుతున్న ఒక ఫోటోని స్టీవెన్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. త్వరలోనే RRR కి సంబందించిన కీలక షెడ్యూల్ మొదలవ్వనుంది. ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ చిత్ర యూనిట్ తో కలవనున్నాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా