వర్మ సినిమాలో లోకేష్.. టైగర్ కేసీఆర్ లో పాత్రలు!

Published : Apr 20, 2019, 10:35 AM ISTUpdated : Apr 20, 2019, 10:37 AM IST
వర్మ సినిమాలో లోకేష్.. టైగర్ కేసీఆర్ లో పాత్రలు!

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కోసం వర్మ నటీనటులను కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో ఎవరెవరిని చూపించబోతున్నారు అనే విషయంలో వర్మ ముందే క్లారిటీ ఇచ్చాడు. 

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో కొత్త రాజకీయ సినిమాను రెడీ చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కోసం వర్మ నటీనటులను కూడా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో ఎవరెవరిని చూపించబోతున్నారు అనే విషయంలో వర్మ ముందే క్లారిటీ ఇచ్చాడు. 

టైగర్ కేసీఆర్ అనే ఈ బయోపిక్ లో  కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌, హ‌రీష్ రావు, వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్‌, చంద్ర‌బాబు నాయుడు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి, రామోజీరావు, లోక్‌ష్ వంటి ప్రముఖ వ్యక్తుల పాత్రలను చూపించబోతున్నాడు. 

ఇక సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ని 11గంటలకు విడుదల చేయనున్నట్లు వర్మ క్లారిటీ ఇచ్చాడు.మరి ఆర్జీవీఎలాంటి స్టైల్ లో ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?