తారక్ చప్పుడుతో బాలయ్య ఫ్యాన్స్ లో డౌట్స్?

Published : Apr 20, 2019, 12:58 PM IST
తారక్ చప్పుడుతో బాలయ్య ఫ్యాన్స్ లో డౌట్స్?

సారాంశం

సాధారణంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు వారి ఫ్యామిలీ నుంచి ఏవైనా సినిమాలు రిలీజయితే వెంటనే స్పందిస్తారు. అయితే నందమూరి కుటుంబంలో మాత్రం అలాంటి సీన్స్ ఎక్కువగా కనిపించవని కథనాలు వెలువడుతున్నాయి. 

జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో స్పందించడమనేది చాలా రేర్. సాధారణంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు వారి ఫ్యామిలీ నుంచి ఏవైనా సినిమాలు రిలీజయితే వెంటనే స్పందిస్తారు. అయితే నందమూరి కుటుంబంలో మాత్రం అలాంటి సీన్స్ ఎక్కువగా కనిపించవని కథనాలు వెలువడుతున్నాయి. 

బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య కనిపించని యుద్ధం జరుగుతోందని చాలా రోజులుగా అందరిలో మెదులుతున్న అంశం. అప్పుడపుడు కొన్ని సీన్స్ ల వల్ల ఇద్దరు ఒక్కటయ్యారనే భావన కూడా కలుగుతోంది. కానీ ఎన్టీఆర్ బయోపిక్ రిలీజయితే సినిమా ట్రైలర్ పై తప్పితే మారే విధంగా స్పందించని తారక్ ఇప్పుడు జెర్సీ సినిమాను ఒక రేంజ్ లో పొగిడాడు. 

సినిమా అద్భుతంగా ఉందంటూ బ్రిలియంట్ బ్రిలియంట్ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా నానిని చూసి చాలా గర్వపడుతున్నా అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్ అయ్యింది. బాలకృష కథానాయకుడు - మహానాయకుడు సినిమాలపై మహేష్ లాంటి స్టార్ హీరో సైతం పాజిటివ్ కామెంట్ చేయగా ఇతర సినీ ప్రముఖులు సినిమా చూసి ప్రశంసలు కురిపించారు. 

సినిమా రిజల్ట్ సంగతి పక్కనపెడితే సినిమా రిలీజ్ కు ముందు ఆ తరువాత ప్రమోషన్ కోసమైనా తారక్ ఓ ట్వీట్ వేయలేదు. ఇక ఇప్పుడు నాని సినిమా కోసం చాలా స్ట్రాంగ్ గా ట్వీట్ వేయడంతో పలువురిలో వింత ఆలోచనలను కలిగిస్తోంది. అసలైతే జెర్సీ నిర్మాతకు తారక్ కి మంచి స్నేహం ఉంది. అరవింద సమేతకి లైన్ ప్రొడ్యూసర్ గా ఉన్న వంశీ ఈ సినిమాకు నిర్మాత కావడంతో తారక్ సినిమా చూసి తన అభిప్రాయాన్ని తెలిపాడని చెప్పవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా