మరో సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా జూ.ఎన్టీఆర్.. కళ్ళు చెదిరే డీల్ ?

Published : Nov 11, 2022, 11:41 AM IST
మరో సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా జూ.ఎన్టీఆర్.. కళ్ళు చెదిరే డీల్ ?

సారాంశం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించబోయేది ఈ చిత్రంలోనే. 

అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం యాడ్ షూట్స్ తో బిజీగా ఉన్నట్లు టాక్. తాజాగా తారక్ ఒక కొత్త ఎండార్స్మెంట్ కి సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ యాడ్ కి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ యాడ్ కి సంబంధించిన వివరాలని అధికారికంగా ప్రకటించనున్నారు. 

టివి, డిజిటల్ యాడ్ కోసం ఈ షూటింగ్ చేయనున్నారు. ఒక ప్రముఖ కంపెనీ ప్రోడక్ట్ కోసం తారక్ ఈ యాడ్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ద్వారా తారక్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తారక్ పలు సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. 

ఇక సినిమా విషయానికి వస్తే కొరటాల చిత్రంలో ఎన్టీఆర్ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కళ్ళు చెదిరే యాక్షన్ బ్లాక్స్ తో కొరటాల శివ పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. కొరటాల చిత్రం తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?