రజనీకాంత్ - సల్మాన్.. అవెంజర్స్ అయితే..?

By Prashanth MFirst Published Apr 7, 2019, 10:36 AM IST
Highlights

అవెంజర్స్ సిరీస్ లు వరల్డ్ వైడ్ గా ఎంతగా పాపులర్ అయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఇప్పుడు రాబోతున్న ఎండ్ గేమ్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అసలు మ్యాటర్ లోకి వస్తే.. అవెంజర్స్  చిత్ర దర్శకుడు జోయి రుస్సో ఇండియన్ స్టార్స్ పై ఓ కామెంట్ చేశారు. 

మెయిన్ గా శంకర్ రోబో సినిమా చూసి దాని స్పూర్తితో  అవెంజర్స్‌: ఏజ్‌ ఆఫ్‌ అల్ట్రాన్స్‌ సినిమా క్లయిమాక్స్ ను తెరకెక్కించినట్లు చెబుతూ ఆ సినిమా తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇండియన్ నటీనటులను అవెంజర్స్ తో పోలుస్తూ.. సల్మాన్ ఖాన్ వంటి హీరోని ఒక హల్క్ గా చూపించవచ్చని.. అలాగే సూపర్ స్టార్ రాజినీకాంత్ ని ఐరెన్ మెన్ గా ప్రజెంట్ చేయవచ్చని రుస్సో వివరణ ఇచ్చారు. 

అవెంజర్స్ ఎండ్ పార్ట్ ని ఇండియాలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ తో పాటు సౌత్ లో అన్ని భాషల్లో ఈ నెల 26న ఈ హై యాక్షన్ మూవీ రిలీజ్ కానుంది.  ఇన్ఫినిటీ వార్‌ సినిమా ఇండియాలో 200కోట్లకు పైగా వసూలు చేయడంతో చిత్ర యూనిట్ ఇక్కడ కూడా ప్రమోషన్ డోస్ పెంచుతోంది. 

click me!