ఓవర్సీస్ లో 'జెర్సీ' జోరు మాములుగా లేదుగా!

Published : Apr 21, 2019, 03:53 PM IST
ఓవర్సీస్ లో 'జెర్సీ' జోరు మాములుగా లేదుగా!

సారాంశం

నేచురల్ స్టార్ నాని చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. 'ఎవడే సుబ్రమణ్యం', 'భలే భలే మగాడివోయ్' వంటి సినిమాలతో అక్కడ నానికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 

నేచురల్ స్టార్ నాని చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉంది. 'ఎవడే సుబ్రమణ్యం', 'భలే భలే మగాడివోయ్' వంటి సినిమాలతో అక్కడ నానికి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. పెద్ద హీరోలు సైతం ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ చేరుకోవడానికి కష్టపడుతున్న రోజుల్లో నాని అవలీలగా మిలియన్ మార్క్ ని అందుకున్నాడు.

తాజాగా నాని నటించిన 'జెర్సీ' సినిమాకి కూడా ఓవర్సీస్ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈసారి వీకెండ్ లోనే సినిమా మిలియన్ డాలర్ల మార్క్ ని అందుకునేలా కనిపిస్తోంది. గురువారం నాడు ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 1.45 లక్షల డాలర్లను వసూలు చేసింది. శుక్రవారం నాడు 2.6 లక్షల డాలర్లను కొల్లగొట్టింది.

దీంతో ప్రీమియర్లతో కలిపి ఈ సినిమా 4 లక్షల డాలర్ల మార్క్ దాటేసింది. శుక్రవారంతో పోల్చుకుంటే శని, ఆదివారాలు ఆ క్రేజ్ మరింతగా ఉంటుంది. రోజుకి మూడు మిలియన్లు వసూలు చేసినా.. వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా మిలియన్ డాలర్ల మార్క్ ని చేరుకోవడం ఖాయమనిపిస్తుంది.

ఓవర్సీస్ ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా ఈ సినిమా ఉండడంతో అక్కడ ప్రేక్షకాదరణ దక్కుతోంది. లాంగ్ రన్ లో ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి!
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా