రోడ్డు మీద శృంగారం చేయం కదా.. జీవిత ఘాటు కామెంట్స్!

By AN TeluguFirst Published May 3, 2019, 2:52 PM IST
Highlights

'RX100', 'అర్జున్ రెడ్డి' సినిమాల తరువాత టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని.. ఇది మంచి పరిణామం కాదని దర్శకనిర్మాతల ఆలోచన తీరు మారాలంటూ నటి, సెన్సార్ బోర్డ్ మెంబర్ జీవితారాజశేఖర్ అన్నారు. 

'RX100', 'అర్జున్ రెడ్డి' సినిమాల తరువాత టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తో కూడిన సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని.. ఇది మంచి పరిణామం కాదని దర్శకనిర్మాతల ఆలోచన తీరు మారాలంటూ నటి, సెన్సార్ బోర్డ్ మెంబర్ జీవితారాజశేఖర్ అన్నారు. తాజాగా 'డిగ్రీ కాలేజ్' అనే సినిమా ట్రైలర్ లాంచ్ జరిగింది. దీనికి అతిథిగా జీవితా విచ్చేశారు. 

ఈ సందర్భంగా ఆమె ట్రైలర్ పై ఘాటుగా స్పందించింది. తెలుగులో లిప్ లాక్ లేకుండా సినిమాలు రావడం లేదని అసహనం వ్యక్తం చేసింది. సినిమాలో కంటెంట్ లేకపోతే ఎన్ని లిప్ లాక్ లు పెట్టి, అమ్మాయిని నగ్నంగా చూపించినా సినిమా హిట్ అవ్వదంటూ హితబోధ చేసింది. ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది.. కానీ అది ఎక్కడ పడితే అక్కడ చేయమని.. కొన్ని వందల మంది మధ్యలో అలా ప్రవర్తించమని.. ఇటువంటి సినిమాలు థియేటర్ లో చూడడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది.

సోషల్ మీడియాలో, టీవీల్లో ఉండడం లేదా అని కొందరు వాదిస్తున్నారని, అయితే వాటిలో ఒక్కరే రూమ్ లో ఉండి చూస్తుంటారని చెప్పుకొచ్చింది. సెన్సార్ బోర్డ్ మెంబర్ గా దర్శకులు సామాజిక బాధ్యతతో సినిమాలు తీయాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.

ఇటువంటి సినిమాలకు సెన్సార్ ఇవ్వకపోతే దానికి కూడా గొడవ చేస్తున్నారని, కాంట్రవర్సీ కోసం తాను ఈ మాటలు చెప్పడం లేదని, మనసుకి అనిపించింది చెప్పినట్లు స్పష్టం చేసింది. 

'డిగ్రీ కాలేజ్' ట్రైలర్.. మొత్తం బూతు కంటెంటే!

click me!