తనయుడి పేరు ప్రకటించిన జవాన్ దర్శకుడు అట్లీ. ఇంతకీ ఏం పేరు పెట్టారంటే..?

Published : May 07, 2023, 07:32 PM IST
తనయుడి పేరు ప్రకటించిన జవాన్ దర్శకుడు అట్లీ. ఇంతకీ ఏం పేరు పెట్టారంటే..?

సారాంశం

తమిళ స్టార్ డైరెక్టర్ అట్ట్లీ ఈమధ్యే ఓ బిడ్దకు తండ్రి అయ్యాడు. స్టార్ హీరోలతో వరుస ప్రాజెక్ట్స్ సెట్స్ ఎక్కిస్తున్న ఈకుర్ర దర్శకుడు తాజాగా తన కుమారుడి పేరు రివిల్ చేశాడు.   

పాన్ఇందియా వైడ్ గా చూస్తే.. స్టార్స్ డైరెక్టర్స్.. టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నారు. అయితే ఇందులో టాలెంటెడ్‌ డైరెక్టర్ కమ్ స్టార్ డైరెక్టర్ అంటే అట్లీ పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బీ టౌన్  స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో.. భారీ స్టార్ కాస్టింగ్ తో.. రూపొందుతున్న ఈసినిమా.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా షారుఖ్ సరసన జోడీగా నయనతార నటిస్తోంది. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈమూవీని ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు ఈరోజే ప్రకటాంచారు.

తమకు కొడుకు పుట్టిన శుభవార్తను ఇప్పటికే అట్లీ-ప్రియా మోహన్‌ కపుల్‌ మూవీ లవర్స్‌, అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే తాజాగా అట్లీ కపుల్‌ తమ కుమారుడి పేరును కూడా చెప్పేశారు. తమ కుమారుడికి మీర్‌  అనే పేరు పెట్టినట్టు.. సోషల్ మీడియ వేదికగా  తెలియజేశారు. ఈ విషయాన్నితెలియజేస్తూ.. ట్వీట్ చేశారు స్టార్ కపూల్.  మీ ఆశీస్సులు కావాలని నెటిజన్లు, అభిమానులను కోరారు. మా లిటిల్‌ ఏంజెల్‌ పేరును తెలియజేస్తుండటం సంతోషంగా ఉంది.. అని ప్రియా మోహన్ ట్వీట్ చేసింది. మీర్‌తో ఉన్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. 

 

జవాన్ షూటింగ్ దశలో ఉంది. జవాన్‌లో న‌య‌న‌తార ఇన్వెస్టిగేటివ్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నట్టు తెలుస్తోంది. జవాన్‌ జవాన్ మూవీలో  కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. జవాన్‌ చిత్రాన్ని హోంబ్యానర్‌ రెడ్ చిల్లీస్ బ్యాన‌ర్‌పై షారుఖ్ ఖాన్‌ తెర‌కెక్కిస్తున్నాడు. షారుఖ్‌ ఖాన్‌ దీంతోపాటు సల్మాన్‌ ఖాన్‌ లీడ్ రోల్‌లో నటిస్తున్న టైగర్‌ 3లో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?