జపాన్ లో RRR క్రేజ్.. ఓ తల్లి తన 7 ఏళ్ల కొడుకు కోసం ఏం చేసిందంటే, ఇది నిజమైన రీచ్ అంటే..

By Asianet NewsFirst Published Mar 30, 2023, 7:59 PM IST
Highlights

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూనే ఉంది. ఆస్కార్ అవార్డు సాధించడంతో ఆర్ఆర్ఆర్ ఆగిపోలేదు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంటూనే ఉంది. ఆస్కార్ అవార్డు సాధించడంతో ఆర్ఆర్ఆర్ ఆగిపోలేదు. గత ఏడాది మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల వరకు రికార్డ్ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత అసలు జాతర మొదలయింది. 

నెమ్మదిగా వెస్ట్రన్ ఆడియన్స్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని బాగా కనెక్ట్ అయ్యారు. రాజమౌళి దర్శకత్వం, ఎన్టీఆర్, రాంచరణ్ నటనకు యూఎస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాల్లో ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఆ క్రేజ్ కారణంగానే నాటు నాటు సాంగ్ ఆస్కార్ కూడా కైవసం చేసుకుంది. జపాన్ ప్రేక్షకులు అయితే ఇండియన్ ఆడియన్స్ ని మించేలా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఓన్ చేసుకున్నారు. 

జపాన్ లో ఒక తల్లి తన ఏడేళ్ల కొడుకు కోసం ఆర్ఆర్ఆర్ మూవీ స్టోరీని పుస్తకంగా ప్రింట్ చేసింది అంటే ఆ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్ర నిడివి మూడు గంటల పైనే ఉంటుంది. తన ఏడేళ్ల కొడుకు సబ్ టైటిల్స్ గమనిస్తూ మూడు గంటల పాటు సినిమా చూడడం కష్టం అని ఓ తల్లి భావించింది. దీనితో తన కొడుకు ఆర్ఆర్ఆర్ చిత్ర కథ అర్థం చేసుకునేలా బొమ్మల రూపంలో జాపనీస్ భాషల్లో పుస్తకాన్ని ప్రచురించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ROAR OF RRR (@ssrrrmovie)

జాపనీస్ భాష కాబట్టి తన కొడుకు సులభంగా చదివి అర్థం చేసుకుంటాడని ఆమె భావించింది. ప్రస్తుతం ఈ బుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బుక్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఆస్కార్ కి మించిన గౌరవం రీచ్ అని కొనియాడుతున్నారు. 

ఒక తెలుగు చిత్రాన్ని జపాన్ లోని మహిళ తన కొడుకు అర్థం చేసుకోవాలని తపిస్తోంది అంటే అంతకి మించిన విజయం మరొకటి లేదు. మా దేశ చిత్రంపై ఇంతటి ప్రేమ చూపిస్తున్నందుకు జపాన్ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

click me!