‘అవతార్‌-2' ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో షాకింగ్ కలెక్షన్స్

By Surya PrakashFirst Published Dec 17, 2022, 3:19 PM IST
Highlights

ప్రతీ ఫ్రేమ్ ని ఓ  విజువల్ ట్రీట్ లా చెక్కుకుంటూ పోయాడు. దీని వెనుక 13 ఏళ్ల కష్టం...కొత్తగా వచ్చిన టెక్నాలిజీని అర్దం చేసుకుని వినియోగించుకున్న తీరు ఆశ్చర్యపరుస్తాయి.  


 
ఊహాశక్తికి ఎల్లలు లేవనే మాటను నిజం చేస్తూ అప్పట్లో  అవతార్ ...ఇప్పుడు దాని సీక్వెల్ వచ్చేసాయి.  వరల్డ్ సినిమాపై ఇది  ఓ మాస్టర్ స్ట్రోక్ లా కనిపిస్తుందంటూ చాలా మంది ప్రశంసించారు. పార్ట్ వన్ లో పాత్రలను కంటిన్యూ చేస్తూ ఈ సారి అదే పండోరా లోకంలో మళ్లీ కథ నడపకుండా ముందుకు వెళ్లి...సముద్ర గర్బంలో ప్రిమైజ్ ,సెటప్  పెట్టడం అంటే మాటలు కాదు.    అవతార్ 2 కి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. మొదటి రోజు నుంచి సినిమా కలెక్షన్లు ఆకాశాన్ని అంటాయి. 

  ఓపెనింగ్ డే రోజు ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకుంది. దీంట్లో చాలా వరకు కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల నుంచి రావటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అవతార్ 2 సినిమా మొదటి రోజున 14 కోట్లు వసూలు చేసింది. అందులో 8 కోట్లు కేవలం నైజాం ఏరియా నుంచి మాత్రమే వచ్చాయి.  

బడ్జెట్ రీత్యానే కాదు... అందులో పాత్రలను, సీన్స్ ని, విజువల్స్ ఏదీ ఊహించటం కష్టమే.అయితే వీటిన్నటిని పట్టి ఉంచే కథ విషయంలో మాత్రం కాస్తంత తడబడ్డాడనే చెప్పాలి.  కావాలని పాత కథనే తీసుకుని తన దగ్గర ఉన్న పాత్రలను, ట్విస్ట్ లను పెట్టారో లేక పాతదైతేనే తన కొత్త విజువల్స్ లో చెప్పటానికి సంక్లిష్టం లేకుండా ఉంటుందని భావించోడో కాని కామెరాన్ కొత్తగా ఈ సినిమాని ఆవిష్కరించే ప్రయత్నం చేసారు.  ప్రతీ ఫ్రేమ్ ని ఓ  విజువల్ ట్రీట్ లా చెక్కుకుంటూ పోయాడు. దీని వెనుక 13 ఏళ్ల కష్టం...కొత్తగా వచ్చిన టెక్నాలిజీని అర్దం చేసుకుని వినియోగించుకున్న తీరు ఆశ్చర్యపరుస్తాయి.  

స్టోరీ లైన్ చిన్నది తీసుకుని ..దాన్ని నిలువుగా కాకుండా అడ్డంగా విస్తరిస్తూ విజువల్స్ కు విస్తృత అవకాసం ఇచ్చేలా సీన్స్ రెడీ చేసుకున్న తీరు అబ్బుర పరుస్తుంది. ఆలోచిస్తే ... విజువల్స్ తోనే సీన్స్ చేసారేమో అని అనిపిస్తుంది.     సామ్ వర్తింగ్ టన్, జో సల్దాన ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా లో సిగోర్నీ వీవర్, స్టీఫెన్ లాంగ్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూరే, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

click me!