ఒళ్లు గగుర్పొడిచేలా జేమ్స్ బాండ్‌ కొత్త ట్రైలర్‌

Published : Sep 03, 2020, 09:12 PM ISTUpdated : Sep 03, 2020, 09:32 PM IST
ఒళ్లు గగుర్పొడిచేలా జేమ్స్ బాండ్‌ కొత్త ట్రైలర్‌

సారాంశం

జేమ్స్ బాండ్‌ నుంచి కొత్త సినిమా `నో టైమ్‌ టు డై` రాబోతుంది. `జేమ్స్ బాండ్‌` సిరీస్‌లో భాగంగా వస్తోన్న 25వ చిత్రమిది. క్యారీ జోజి ఫకునాగా దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో బాండ్‌గా డానియల్‌ క్రేగ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. 

`జేమ్స్ బాండ్‌` సినిమాల గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా `జేమ్స్ బాండ్‌` సిరీస్‌ అంతగా పాపులర్. ముఖ్యంగా `బాండ్‌.. జేమ్స్ బాండ్‌ 007` అని హీరో చెప్పే డైలాగ్‌ ఆడియెన్స్ ని ఉరకలెత్తిస్తుంది. ఈ బ్రిటీష్‌ కి చెందిన సిరీస్‌ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్‌. 

తాజాగా ఈ సిరీస్‌ నుంచి కొత్త సినిమా `నో టైమ్‌ టు డై` రాబోతుంది. `జేమ్స్ బాండ్‌` సిరీస్‌లో భాగంగా వస్తోన్న 25వ చిత్రమిది. క్యారీ జోజి ఫకునాగా దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో బాండ్‌గా డానియల్‌ క్రేగ్‌ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.  

ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాలతో, ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ సాగింది. గతం ఇంకా గతించలేదని బాండ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో ఊహకందని యాక్షన్‌ ఘట్టాలు, బాండ్‌ గర్ల్స్ గ్లామర్‌, మిస్టీరియస్‌ కార్లు, అత్యాధునిక ఆయుధాలతో బాండ్‌ ట్రైలర్‌ ఎలా ఉండాలో, దాన్నిమించి తాజా సినిమా ట్రైలర్‌ ఉందని చెప్పొచ్చు. బాండ్‌ మార్క్ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, కార్‌ యాక్షన్‌ సీన్లు ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి. 

ఈ సినిమా నిజానికి ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు ఈ నెల 20న అమెరికాలో విడుదల కానుంది. నవంబర్‌ 12న యూకేలో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు. ఇది మన దేశంలో కూడా విడుదలకు ప్లాన్‌ జరుగుతుంది.మరి గత సినిమాల మాదిరిగానే ఇది ఆడియెన్స్ ని అలరిస్తుందా అనేది చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?